నిడమనూరు, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని రేగుల గడ్డ సర్పంచ్ ధనావత్ గుణ నాయక్(Dhanavat GunaNaik)పై కొందరు దాడికి పాల్పడ్డారు. నిరూపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరొక చోట పాతాలని చెప్పినందుకు ఆయనపై రెడ్డి కులస్తులు దాడికి దిగారు. గ్రామాభివృద్ధికి పాటుపడాలని తన మంచి ఆలోచనను అర్ధం చేసుకోకుడా తనపై దాడికి దిగిన ఇద్దరిపనై సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధిత సర్పంచ్ కథనం ప్రకారం… రేగులగడ్డ పంచాయతికి ఇటీవల 30 విద్యుత్ స్తంభాలు మంజూరయ్యాయి. విద్యుత్ స్థంబాలను అవసరం ఉన్నచోట ఏర్పాటు చేయాలని సర్పంచ్ ధనావత్ గుణ నాయక్ భావించారు. ఈ క్రమంలోనే శనివారం చామల ఉపేందర్ రెడ్డి ఇంటి ముందు నిరూపయోగంగా ఉన్న స్తంభాన్ని మరో చోట పాతాలని విద్యుత్ సిబ్బందికి సర్పంచ్ సూచించారు.
‘మా ఇంటి దగ్గర స్తంభాన్ని తరలించాలని చెబుతావా?’ అని కోపంతో ఊగిపోయిన చామల ఉపేందర్ రెడ్డి, చామల పెద్ద రామిరెడ్డిలు సర్పంచ్‌పై దాడి చేశారు. వారి దాడిలో సర్పంచ్ గుణ నాయక్‌కు గాయాలయ్యాయి. ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో.. అవసరమున్న చోట విద్యుత్ స్తంభాల్ని ఏర్పాటు చేయాలనుకుంటే తనపై దాడి చేశారని చామల ఉపేందర్ రెడ్డి, చామల పెద్ద రామిరెడ్డిలపై సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.