సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 25 : సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సినీనటులు సందడి చేశారు. గాంధీచౌక్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాసవి వస్ర్తాలయను యాంకర్ సుమ, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ బుల్లిరాజు ప్రారంభించారు. వినియోగదారులకు సుమ పట్టు వస్ర్తాలను చూపించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపైకి వచ్చి ఇద్దరూ సందడి చేశారు. వీరిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. యాంకర్ సుమ మాట్లాడుతూ, సిరిసిల్లకు రావడం తనకు సంతోషంగా ఉందని, వాసవి వస్ర్తాలయను ప్రారంభించడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఈ షాపింగ్ మాల్లో మన్నికైన వస్ర్తాలు విక్రయిస్తున్నారని, ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయని, ప్రత్యేక బ్రైడల్ పట్టుచీరలు బాగున్నాయని చెప్పారు.
తర్వాత షాపింగ్‌మాల్ యజమానులు మాట్లాడుతూ, నాణ్యమైన వస్ర్తాలను అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని, సిరిసిల్ల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్, బీఆర్ఎస్ పట్టణా ధ్యక్షుడు జిందం చక్రపాణి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, షాపింగ్‌మాల్ యజమానులు మాటేటి దుర్గం ప్రకాశ్, మాటేటి సునీత, మాటేటి ఉమమహేశ్వరి, మాటేటి సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.