గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు.. ఇలా డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. నిత్యం విద్యార్థులు, యువకుల ఆటలపోటీలతో కళకళలాడాల్సిన ఈ మైదానాల్లో గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన చెత్తాచెదారంతో కళావిహీనంగా మారాయి.
కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోక, సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక మైదానాలు అధ్వానంగా మారడమే గాక పరిసరాలన్నీ కంపుకొడుతున్నాయి. ఇది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లోని తెలంగాణ క్రీడా ప్రాంగణం దుస్థితి.