AI Minister | నా ముఖం నాకు తిరిగిచ్చేయండి.. అల్బేనియాలో ఏఐ మంత్రికి ముఖమిచ్చిన మహిళ డిమాండ్..!
AI Minister | యూరప్ దేశమైన అల్బేనియా (Albania) లో ఏఐ మంత్రి (AI Minister) కి ముఖరూపమిచ్చిన మహిళ ఇప్పుడు తన ముఖం తనకు కావాలని డిమాండ్ చేస్తున్నది. రాజకీయ కారణాల కోసం తన ముఖాన్ని వినియోగించేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని అంటోంది. కాగా దేశంలో అవినీతిని నిరోధించేందుకు అల్బేనియా కృత్రిమ మేథ (Artificial Intelligence) ఆధారిత ‘డియెల్లా (Diella)’ అనే అసిస్టెంట్‌ను ఉపయోగిస్తున్నది.
AI Minister : యూరప్ దేశమైన అల్బేనియా (Albania) లో ఏఐ మంత్రి (AI Minister) కి ముఖరూపమిచ్చిన మహిళ ఇప్పుడు తన ముఖం తనకు కావాలని డిమాండ్ చేస్తున్నది. రాజకీయ కారణాల కోసం తన ముఖాన్ని వినియోగించేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని అంటోంది. కాగా దేశంలో అవినీతిని నిరోధించేందుకు అల్బేనియా కృత్రిమ మేథ (Artificial Intelligence) ఆధారిత ‘డియెల్లా (Diella)’ అనే అసిస్టెంట్‌ను ఉపయోగిస్తున్నది. ప్రజాధనంతో చేపట్టే ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం నియమించిన ఈ వర్చువల్ మహిళను ఏఐ మంత్రిగా ప్రకటించడం ప్రపంచదేశాలను ఆశ్చర్యపరిచింది. అక్కడి పార్లమెంటులోనూ ఈ ఏఐ మంత్రి ప్రసంగించి వార్తల్లో నిలిచింది.
అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ మంత్రికి ముఖరూపం కల్పించిన మహిళ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుపడుతున్నది. రాజకీయ కారణాల కోసం తన ముఖాన్ని వినియోగించేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని, వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తోంది. అల్బేనియాకు చెందిన అనీలా బీషా (Anila Bisha) కళాకారిణి. మూడు దశాబ్దాలుగా నాటక రంగం, తెరమీద నటిస్తూ ఎంతో ప్రసిద్ధి చెందారు. అయితే 2025లో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువచేసే లక్ష్యంతో రూపొందించిన ఓ ఆన్లైన్ పోర్టల్‌లో వర్చువల్ అసిస్టెంట్ (Chatbot) కోసం తన ముఖాన్ని, వాయిస్‌ను వినియోగించుకునేందుకు అంగీకరించారు.
డియెల్లా చాట్‌బాట్‌కు వాస్తవిక రూపం కల్పించేందుకు అనీలా గంటలపాటు నిలబడి మాట్లాడారు. యూజర్ ఇచ్చే ప్రశ్నలకు సహజంగా ప్రతి స్పందించేందుకు ఆమె నోటి కదలికలను, ప్రతి స్వరాన్ని రికార్డు చేశారు. చివరకు డియెల్లా అందుబాటులోకి వచ్చిన కొన్ని నెలల్లోనే 10 లక్షలకుపైగా కన్వర్షేషన్స్ జరిగాయి. దాదాపు 36 వేల డాక్యుమెంట్లను జారీచేసింది. దీని పనితీరుపై ప్రభుత్వం, యూజర్ల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఈ క్రమంలో అల్బేనియా ప్రధాని ఎడీ రామా సెప్టెంబర్‌లో ఈ చాట్‌బాట్‌ను ‘ఏఐ మంత్రి’గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
దీనిపై విపక్షాలతోపాటు అనీలా బీషా కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజకీయ కారణాల కోసం తన ముఖాన్ని, గొంతును వాడుకోవడం సమంజసం కాదంటూ ఆందోళన వ్యక్తంచేశారు. కేవలం ఈ-సర్వీస్‌లో వాడుకునే ఒప్పందానికే అంగీకరించానని, డిసెంబర్‌తోనే అది ముగిసిందన్నారు. అక్టోబర్‌లో బెర్లిన్ సమావేశంలో ప్రధాని రామా మాట్లాడుతూ.. డియెల్లా గర్భిణీ అని, ఆమె త్వరలోనే 83 మంది పిల్లలకు జన్మనిస్తుందని (ఒక్కో ఎంపీకి ఒక్కొకరు) చెప్పడాన్ని బీషా తీవ్రంగా తప్పుపట్టారు.
ఆ ప్రకటన తననెంతో బాధించిందని బీషా చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. అయితే దీనిపై న్యాయపోరాటం ప్రారంభించిన ఆమెకు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. అయినప్పటికీ తన ముఖం, గొంతును వాడకుండా ఉండే వరకు పోరాడతానని ఇటీవల ఓ వార్త సంస్థకు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

