IND vs ZIM : చావోరేవో పోరులో భారత క్రికెటర్లు శివాలెత్తిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(55) ఫామ్ చాటుకుంటూ అర్ధశతకంతో రెచ్చిపోగా.. వచ్చినవాళ్లు వచ్చినట్టు వీరంగం సృష్టించారు. జింబాబ్వే బౌలర్లను హడలెత్తిస్తూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(33), తిలక్ వర్మ(44 నాటౌట్)లు కసిదీరా కొట్టగా.. హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) తన స్టయిల్ విధ్వంసంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. టాపార్డర్ సహా మిడిల్ మెరుపులతో టీమిండియా పొట్టి ప్రపంచకప్‌లో 256తో వ్యక్తిగత రికార్డు(గతంలో 220 రన్స్)ను బ్రేక్ చేసింది.
సెమీఫైనల్ బెర్తు పట్టేయాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు శుభారంభమిచ్చారు. అభిషేక్ శర్మ జతగా ఇన్నింగ్స్ ఆరంభించిన సంజూ శాంసన్(24) ఉన్నంత సేపు తనదైన స్టయిల్లో చెలరేగి స్కోర్ బోర్డును ఉరికించాడు. ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచిన సంజూ.. ఆ తర్వాత మపోస ఓవర్లో ఫోర్ బాదగా.. రెండు ఫోర్లు, సిక్సర్‌తో అభిషేక్ టచ్‌లోకి వచ్చాడు. అయితే.. ముజరబని ఓవర్లో సిక్సర్‌కు యత్నించి ఔటయ్యాడు. దాంతో.. 46 వద్ద మొదటి వికెట్ పడింది. శాంసన్ ఔటైనా.. అభిషేక్ శర్మ(55) , ఇషాన్ కిషన్(38)లు జోరు తగ్గించలేదు. పవర్ ప్లే చివరి బంతిని అభిషేక్ సిక్సర్‌గా మలిచాడు. ఫలితంగా భారత్ వికెట్ నష్టానికి 80 రన్స్ కొట్టింది. రజా ఓవర్లో సిక్సర్ బాదిన ఇషాన్.. తర్వాతి బంతికే నగవర చేతికి చిక్కాడు.
Innings Break!
A collective batting effort takes #TeamIndia to their highest-ever total in #T20WorldCup history 💪
Over to the bowling unit now!
Scorecard ▶️ https://t.co/p4GxtxFMLH#MenInBlue | #INDvZIM pic.twitter.com/cFua2U93ke
— BCCI (@BCCI) February 26, 2026
అనంతరం సూర్యకుమార్ యాదవ్(33), తిలక్ వర్మ(44 నాటౌట్)లు కసిదీరా కొట్టారు. నగవర ఓవర్లో సూర్య ఔటయ్యాక తిలక్ జతగా హార్దిక్ పాండ్యా(50 నాఔట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్‌గా మలిచిన పాండ్యా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సమిష్టిగా రాణించడంతో 4 వికెట్ల నష్టానికే 256 రన్స్ కొట్టింది టీమిండియా. తద్వారా పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసింది.