భోపాల్: ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు స్కూటీలపై వచ్చారు. బిజీ రోడ్డులో ఒక కారును అడ్డుకున్నారు. అందులో ఉన్న ఒక మహిళను బలవంతంగా బయటకు లాగారు. కిడ్నాప్ చేసి స్కూటీపై తీసుకెళ్లారు. (Masked Men Kidnap Woman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం నగరంలోని రద్దీ ప్రాంతమైన దాల్ బజార్లో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు రెండు స్కూటీలపై వచ్చారు. రోడ్డు మధ్యలో స్కూటీని నిలిపి ఒక కారును అడ్డుకున్నారు. కారు వెనుక డోర్ తెరువాలని బలవంతం చేశారు. లేకపోతే కారు అద్దాలు పగులకొడతామని హెచ్చరించారు.
కాగా, కారు వెనుక డోర్ తెరుచుకోగా లోపల ఉన్న మహిళను బలవంతంగా బయటకు లాగారు. ఆమెను కిడ్నాప్ చేసి స్కూటీపై తీసుకెళ్లారు. అయితే ఆ కారు డ్రైవింగ్ సీటులోని వ్యక్తి, అతడి పక్కన ఉన్న మహిళ దీనిపై ప్రతిఘటించలేదు. స్థానికుల సహాయం కూడా కోరలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. అక్కడి జనం కూడా జోక్యం చేసుకోలేదు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆ వాహనాలతో పాటు మహిళను బలవంతంగా తీసుకెళ్లిన ముసుగు ధరించిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
ग्वालियर में गुंडाराज…. शादी के बाद घर जा रहा था परिवार। रास्ता रोककर गाड़ी का कांच फोड़ा और दुल्हन को ले गए बदमाश। pic.twitter.com/jp1taEA5za
— Raju Sharma (@RajuSha98211687) January 22, 2026
Also Read:
contaminated water | కలుషిత తాగునీటి వల్ల.. ఇండోర్ జిల్లాలో 24 మందికి అస్వస్థత
Watch: రైల్వే క్రాసింగ్ వద్ద లారీని ఢీకొట్టిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?