Mega Rythu Mela | మార్చి 8 నుంచి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా రైతు మేళా
Mega Rythu Mela | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదీల్లో మెగా రైతు మేళాను నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడించారు.
హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదీల్లో మెగా రైతు మేళాను( Mega Rythu Mela ) నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య( Janayya ) వెల్లడించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజేంద్ర నగర్ లోని విశ్వవిద్యాలయంలో రైతు మేళాను విజయవంతం చేయాలని కోరారు. మహిళా రైతుల సాధికారిత లక్ష్యంగా నిర్వహించనున్న ఈ మేళకు సుమారు 8 నుంచి 10 వేల మంది మహిళా రైతులు హాజరవుతున్నారని వివరించారు.రెండు రోజుల మెగా మహిళా రైతు మేళాలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు, వాటి పరిష్కారాల పై శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయన్నారు.
రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ పరిధి లోని సెర్ప్‌కు చెందిన సుమారు మూడు వేల మంది మహిళా రైతులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారన్నారు.వివిధ ఆధునిక సాంకేతిక అంశాలపై సుమారు 70 నుంచి 80 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల వచ్చే దుష్ప్రభావాలు, మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాల సాగు వంటి అంశాలపై విశ్వవిద్యాలయం విద్యార్థిని, విద్యార్థులచే ఆటా, పాట కార్యక్రమాలుంటాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

