హైదరాబాద్, ఆగస్టు 5 : రాష్ర్టానికి చెందిన ఇంజినీరింగ్ సేవల సంస్థ బొండాడ ఇంజినీరింగ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.53 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.38.2 కోట్ల లాభంతో పోలిస్తే 38 శాతం ఎగబాకింది.
సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 24 శాతం ఎగబాకి రూ.691.6 కోట్లకు చేరుకున్నది. కంపెనీ తాజాగా ఏరోస్పేస్, రక్షణ రంగ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన కేసీఎస్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌లో 75 శాతం వాటాను కొనుగోలు చేసింది.