Video call | వృద్ధాశ్రమంలో తండ్రి మృతి.. వీడియోకాల్‌లో అంత్యక్రియలు.. హర్యానాలోని చండీగఢ్‌లో అమానవీయ ఘటన
హర్యానాలో మనసులు కలిచివేసే ఘటన జరిగింది. సోనీపట్‌కు చెందిన శివ్‌చరణ్ గుప్తా తన ముగ్గురు కూతుర్లను చదివించడానికి జీవితమంతా కష్టపడ్డాడు. అందులో ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. కా
- కడసారి చూసేందుకు రాని ముగ్గురు కూతుర్లు
- హర్యానాలోని చండీగఢ్‌లో అమానవీయ ఘటన
చండీగఢ్ : హర్యానాలో మనసులు కలిచివేసే ఘటన జరిగింది. సోనీపట్‌కు చెందిన శివ్‌చరణ్ గుప్తా తన ముగ్గురు కూతుర్లను చదివించడానికి జీవితమంతా కష్టపడ్డాడు. అందులో ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. కానీ శివ్‌చరణ్ కు వయసైపోయాక ఎవరూ పట్టించుకోకపోవడంతో వృద్ధాశ్రమంలో చేరాడు. చివరికి అనారోగ్యంతో మరణించినా ముగ్గురు కూతుర్లలో ఒక్కరు కూడా చూడటానికి రాలేదు. వృద్ధాశ్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్‌కు రూ.5,100 పంపించి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పారు. తండ్రి దహన సంస్కారాలను వారు ముగ్గురూ వీడియో కాల్లో చూశారు.
కూతుర్లను చూడాలనే చివరి కోరిక తీరకుండానే శివ్‌చరణ్ చనిపోయాడని ఆనంద్ తెలిపారు. చనిపోయిన తర్వాతైనా వారు వస్తారని తాము ఆశించామని.. సమాచారం ఇచ్చినా వారు రాలేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి జీవితాన్ని త్యాగం చేసి చదివిస్తే కనీసం అంత్యక్రియలకు కూడా రారా అంటూ అనేకమంది తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

