రాంచీ: రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడలేదు. దీంతో పలు వాహనాలు రైలు పట్టాలు దాటుతున్నాయి. ఇంతలో మెల్లగా వచ్చిన రైలు ఒక లారీని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Train Collides With Truck) జార్ఖండ్‌లోని దేవోబంద్లో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో రోహిణి-నవాడిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల మీదుగా పలు వాహనాలు వెళ్తున్నాయి.
కాగా, గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు మెల్లగా వచ్చింది. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని మెల్లగా ఢీకొట్టి ఆగింది. ఆ లారీ ఒక పక్కకు ఒరిగింది. రెండు బైకులను అది ఢీకొట్టింది. అయితే ఆ బైకులపై ఉన్నవారు తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.
మరోవైపు రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుమిగూడిన జనాన్ని వెళ్లగొట్టారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైళ్ల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరించారు.
అయితే సిగ్నల్ క్లియరెన్స్ లేనప్పటికీ ఆ రైలు ముందుకు కదిలిందని గేట్ మ్యాన్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో గేట్ పడకపోవడం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
झारखंड के देवघर में ट्रेन और ट्रक के बीच टक्कर, हादसे में 2 बाइक सवार घायल pic.twitter.com/h7aFT5UOLB
— Shahnawaz Sadique (@shahnawazsadiqu) January 22, 2026
देवघर: जसीडीह में बड़ा रेल हादसा टला. नावाडीह रेलवे फाटक पर गोंडा–आसनसोल एक्सप्रेस की चावल लदे ट्रक से जोरदार टक्कर हुई, जिससे कुछ समय के लिए अप और डाउन दोनों लाइनें प्रभावित रहीं. राहत की बात यह रही कि घटना में कोई हताहत नहीं हुआ. फिलहाल अप लाइन से ट्रेन परिचालन शुरू कर दिया गया… pic.twitter.com/XJzLOKS0ex
— Prabhat Khabar (@prabhatkhabar) January 22, 2026
Also Read:
steel plant explosion | స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. ఏడుగురు సజీవ దహనం, పలువురికి గాయాలు