న్యూఢిల్లీ: పెంపుడు కుక్క నడక కోసం ఒక ఐఏఎస్ అధికారి ఏకంగా స్టేడియాన్ని ఖాళీ చేయించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయనను బదిలీ చేశారు. తాజాగా ఆ ఐఏఎస్ అధికారికి ఢిల్లీలో మళ్లీ కీలక పోస్ట్ దక్కింది. (IAS officer Sanjeev Khirwar) ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ నియమితులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరాం, కేంద్రపాలిత ప్రాంతాల కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన భార్య రింకు కూడా ఐఏఎస్ అధికారిణి.
కాగా, ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ 2022లో ఢిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ)గా పని చేశారు. ఆ ఏడాది మే 26న భార్య, పెంపుడు కుక్కతో కలిసి వాక్ చేసేందుకు ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియాన్ని ఖాళీ చేయించారు. రాత్రి 8 గంటలకు పైగా శిక్షణ పొందే యువ క్రీడాకారులను రాత్రి 7 గంటలలోపు స్టేడియం నుంచి పంపించి వేశారు.
మరోవైపు ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ తన పెంపుడు కుక్క వాకింగ్ కోసం కొన్ని రోజులుగా స్టేడియాన్ని ముందుగా ఖాళీ చేయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వివాదం నేపథ్యంలో ఆయనను లడఖ్‌కు బదిలీ చేసింది.
అయితే ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ను తిరిగి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కమిషనర్‌గా ఆయనను నియమించారు. ప్రస్తుత ఎంసీడీ కమిషనర్ అశ్వనీ కుమార్‌ను జమ్ముకశ్మీర్‌కు బదిలీ చేశారు.
Also Read:
Indore’s crorepati beggar | ఈ బిచ్చగాడు కోటీశ్వరుడు.. మూడు బిల్డింగులు, కారు, ఆటోలు, వడ్డీ వ్యాపారం
Man Forced To Drink Urine | ప్రియురాలి వద్దకు వెళ్లిన యువకుడు.. కొట్టి, మూత్రం తాగించిన ఆమె కుటుంబం