అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ 111వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మార్చి 6న యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలుకానున్నదని తెలిసింది. మలినేని గోపీచంద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో బాలకృష్ణ అండర్‌వరల్డ్ డాన్‌గా కనిపించబోతున్నారట. దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ బుధవారం జరిగిందని వినికిడి.
ముంబై మాఫియా నేపథ్య కథాంశంతో రూపొందనున్న ఈ యాక్షన్ అడ్వెంచర్‌లో బాలకృష్ణ లుక్‌ని మలినేని డిఫరెంట్‌గా ప్లాన్ చేశారట. దానికోసం పలు గెటప్పులతో టెస్ట్ షూట్ నిర్వహించారట. బాలకృష్ణ కూడా మలినేనికి సహకరించారట. అంతేకాదు, ఈ సినిమా కోసం బాలకృష్ణను స్లిమ్ అవ్వమని కూడా మలినేని సూచించారట. ప్రస్తుతం తన శరీరాకృతిని మార్చుకునే పనిలో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకటసతీష్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.