ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
శుక్రవారం ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన భారీ ఖడ్గాన్ని పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ పాత్రతో పాటు ఇందులో మరో కీలకమైన పాత్రని పోషిస్తున్న ఐశ్వర్య దేశాయ్ ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ‘స్పిరిట్’లో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.