steel plant explosion | స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. ఏడుగురు సజీవ దహనం, పలువురికి గాయాలు
steel plant explosion | స్టీల్ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. బొగ్గు కొలిమి అకస్మాత్తుగా పేలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాయ్‌పూర్: స్టీల్ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. బొగ్గు కొలిమి అకస్మాత్తుగా పేలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (steel plant explosion) ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం బకులాహిలోని రియల్ ఇస్పాట్ స్టీల్ ప్లాంట్‌లో దుర్ఘటన జరిగింది. బొగ్గు కొలిమి ప్రాంతం చుట్టూ కొంతమంది కార్మికులు శుభ్రపరిచే పనులు చేస్తుండగా అది పేలింది. మంటలు, దట్టంగా పొగలు చాలా దూరం వరకు కనిపించాయి.
కాగా, మండుతున్న బొగ్గు, అధిక వేడిమి వల్ల సుమారు ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. పది మందికిపైగా కార్మికులకు కాలిన గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు పోలీసులు, అధికారులు ఆ స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. కోల్ ఫర్నేస్ పేలుడుపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్లాంట్‌లోని భద్రతా నిబంధనలను పరిశీలిస్తున్నారు.
VIDEO | Balodabazar-Bhatapara, Chhattisgarh: Six workers feared dead and over 10 injured in a blast reported at a steel factory. More details awaited.
(Source: Third Party)#Chhattisgarh pic.twitter.com/P7fqqnW6LC
— Press Trust of India (@PTI_News) January 22, 2026
Also Read:
Indore’s crorepati beggar | ఈ బిచ్చగాడు కోటీశ్వరుడు.. మూడు బిల్డింగులు, కారు, ఆటోలు, వడ్డీ వ్యాపారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

