Lashkar Commander | లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అనుమానాస్పద మృతి..!
Lashkar Commander | పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) కు చెందిన సీనియర్ కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ (Qari Saieed Abdul Aziz) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లష్కరేకు చెందిన ముసుగు సంస్థ జమాత్ ఉద్ దవాలో ఇతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రార్థనామందిరం ప్రవేశ ద్వారం వద్ద అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
Lashkar Commander : పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) కు చెందిన సీనియర్ కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ (Qari Saieed Abdul Aziz) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లష్కరేకు చెందిన ముసుగు సంస్థ జమాత్ ఉద్ దవాలో ఇతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రార్థనామందిరం ప్రవేశ ద్వారం వద్ద అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కోలుకోలేదు. మెడికల్ ఎమర్జెన్సీ (Medical Emergency) కారణంగానా, లేదా విషప్రయోగం కారణంగా మరణించాడా అనేది కచ్చితంగా తెలియరాలేదు.
అబ్దుల్ అజీజ్ జమ్ముశ్మీర్‌లో ప్రవేశించే ఉగ్రవాదులకు సేఫ్హౌసలు, ఆర్థిక సాయం, తప్పుడు పత్రాలు సమకూర్చడం వంటివి చేస్తుంటాడు. నీలమ్ వ్యాలీ, ముజఫరాబాద్ మీదుగా ఉగ్రవాదులను పంపుతుంటాడు. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం సమకూర్చడం కూడా ఇతడి బాధ్యత. ఇటీవల లష్కరేకు చెందిన సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ ఓ వీడియో విడుదల చేశాడు. తమ సంస్థకు చెందిన 30 మంది సభ్యులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఆరోపించాడు.
వీరంతా గత నాలుగేళ్లలో పాక్, పీవోకేలో మరణించినట్లు పేర్కొన్నాడు. ఇటువంటి హత్యలు జరుగుతున్నట్లు లష్కరే బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

