Yashvir Singh | ఆసియా క్రీడలకు 24 ఏళ్ల బడిసె వీరుడు.. మరో పతకం తెస్తాడా..!
Yashvir Singh : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో 24 ఏళ్ల యశ్వీర్ సింగ్ (Yashvir Singh) ఎంపికయ్యాడు.
Yashvir Singh : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) దూరమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా ఈ టోర్నీకి అందుబాటులోలేని అతడి స్థానంలో 24 ఏళ్ల యశ్వీర్ సింగ్ (Yashvir Singh) ఎంపికయ్యాడు. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యంతో మెరిసిన యశ్వీర్.. ఒలింపిక్ విజేత చోప్రా బదులు జపాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలోబరిలోకి దిగుతాడని గురువారం భారత అథ్లెటిక్స్ సమాఖ్య(AFI) వెల్లడించింది. దాంతో, మరో అథ్లెట్ రోహిత్ యాదవ్‌తో కలిసి జావెలిన్ త్రోలో యశస్వీ దేశానికి పతకం అందించడంపై దృష్టి సారించనున్నాడు.
గత కొంతకాలంగా జావెలిన్ త్రోలో పతకాల పంట పండిస్తున్న నీరజ్ చోప్రా ఈసారి ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదు. కాలి మడిమ చీలిక కారణంగా అతడు బరిలోకి దిగడం లేదు. దాంతో.. అతడి స్థానంలో యశ్వీర్ సింగ్ భారత అథ్లెటిక్స్ స్క్వాడ్‌లోకి వచ్చాడు. కామన్వెల్త్ క్రీడల్లో 85.41 మీటర్ల దూరం ఈటెను విసిరి కంచు మోత మోగించిన ఈ 24 ఏళ్ల ఈ కుర్రాడు ఆసియా వేదికపై అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
Commonwealth Games silver medallist Yashvir Singh has been added to the Indian squad as a replacement for the injured Neeraj Chopra.
It has been a very good year for Yashvir Singh so far. He first improved his personal best to 82.93m at the Indian Athletics Series-9 in Ludhiana.… pic.twitter.com/AKRSz73p4Q
— myKhel.com (@mykhelcom) September 3, 2026
మరో జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్‌తో కలిసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు యశ్వీర్ భావిస్తున్నాడు. అయితే.. వీరికి కామన్వెల్త్లో స్వర్ణం సాధించిన శ్రీలంక అథ్లెట్ రుమేశ్ తరంగ పతిరగే నుంచి గట్టి పోటీ ఎదురవ్వనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొల్లగొట్టిన అర్షద్ నదీమ్(పాకిస్థాన్) సైతం ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి జపాన్‌లోని ఐచీ నగోయలో ఆసియా గేమ్స్ మొదలవ్వనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

