Pakistan | ఆఫ్గనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఇండియా.. ఆఫ్గన్‌కు మద్దతు
Pakistan : ఆఫ్గనిస్తాన్‌పై పాకిస్తాన్ జరుపుతున్న దాడుల్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఇది పాకిస్తాన్ ఆధిపత్య, ఆక్రమణ ధోరణికి నిదర్శనమని ఇండియా వ్యాఖ్యానించింది.
Pakistan : ఆఫ్గనిస్తాన్‌పై పాకిస్తాన్ జరుపుతున్న దాడుల్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఇది పాకిస్తాన్ ఆధిపత్య, ఆక్రమణ ధోరణికి నిదర్శనమని ఇండియా వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మంగళవారం ప్రకటన చేశారు. ఇటీవలి కాలంలో ఆఫ్గనిస్తాన్‌పై పాకిస్తాన్ వరుస దాడులకు దిగుతోంది. గత వారం కూడా ఆఫ్గనిస్తాన్‌పై వైమానిక దాడులకు దిగింది.
ఆఫ్గన్లోని కునార్, పక్తిక ప్రావిన్స్‌లలో పాక్ వైమానిక దాడులకు దిగింది. ఈ ఘటనల్లో పలువురు పౌరులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. యుద్ధ నీతికి వ్యతిరేకంగా సాధారణ పౌరులను, నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగుతోంది. పాక్ జరుపుతున్న ఈ దాడులపై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ పాక్ దాడుల్లో మరణించిన ఆఫ్గన్ పౌరులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పొరుగుదేశ సార్వభౌమత్వంపై పాక్ దాడి చేస్తోందని జైశ్వాల్ విమర్శించారు.
పాక్ చర్యల వల్ల ఈ ప్రాంతంలో శాంతి, భద్రతకు విఘాతం కలుగుతోందన్నారు. ఆఫ్గనిస్తాన్ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు ఇండియా మద్దతుగా నిలుస్తుందని జైశ్వాల్ ఉద్ఘాటించారు. ఆఫ్గన్ ప్రజల సంక్షేమానికి ఇండియా కట్టుబడి ఉందన్నారు. కొంతకాలంగా ఆఫ్గన్‌పై పాక్ వరుసగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఆఫ్గన్ ప్రజలు అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పాక్ దాడులపై తాలిబన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌పై ప్రతి దాడులకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

