Watch: బీజేపీ నిరసన ప్రదర్శనలోకి వెళ్లిన బైకర్.. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేతలు ఏం చేశారంటే?
Ex-MLA smashes man's helmet | బీజేపీ నేతలు నిరసన చేస్తుండగా ఒక వ్యక్తి స్కూటీపై ఆ ప్రదర్శన మధ్యలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలు ఆగ్రహించారు. ఆ వ్యక్తి హెల్మెట్‌ను మాజీ ఎమ్మెల్యే నేలకేసి బాదారు. ఆ స్కూటీ టైర్‌లోని గాలిని తీసేశారు.
బెంగళూరు: బీజేపీ నేతలు నిరసన చేస్తుండగా ఒక వ్యక్తి స్కూటీపై ఆ ప్రదర్శన మధ్యలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలు ఆగ్రహించారు. ఆ వ్యక్తి హెల్మెట్‌ను మాజీ ఎమ్మెల్యే నేలకేసి బాదారు. ఆ స్కూటీ టైర్‌లోని గాలిని తీసేశారు. పలు వాహనదారులపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. (Ex-MLA smashes man’s helmet) కర్ణాటకలోని కలబురగిలో ఈ సంఘటన జరిగింది. కరువు పరిస్థితులతో ప్రభావితమైన కలబురగికి సహాయక చర్యలు చేపట్టాలని, రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ కలబురగి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వెలుపల బీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది.
కాగా, స్కూటీపై వెళ్తున్న ఒక వ్యక్తి పొరపాటున బీజేపీ నిరసన ప్రదర్శన మధ్యలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పాటిల్ టెల్కూర్, ఆ పార్టీ నేతలు అతడిపై ఆగ్రహించారు. ఆ వ్యక్తి స్కూటీని చుట్టిముట్టి ఘర్షణకు దిగారు. మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆ వ్యక్తి హెల్మెట్‌ను లాక్కొని నేలకేసి కొట్టారు. ఆ తర్వాత బీజేపీ నేతలు ఆ స్కూటీ టైర్లలోని గాలిని కూడా తీసేశారు.
మరోవైపు బీజేపీ నిరసన వల్ల ట్రాఫిక్ స్తంభించడంతో హారన్ మోయిస్తున్న పలువురు వాహనదారులపై కూడా మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆటో డ్రైవర్ నుంచి కీ లాక్కొనేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Kalburgi📍
Former BJP MLA Rajkumar Patil Telkur throws helmet of a bike rider, remove air from tyre for simply passing by on the road they are protesting.
This is a blatant Rowdysm by BJP in the name of protest.
My only worry is Priyank is not aggressive enough against these… pic.twitter.com/oksslndZxT
— Mr IG (@RealMrIG) September 2, 2026
Farmers’ protest or public harassment? 🚨
A BJP protest in Kalaburagi turned heated as former Sedam MLA is allegedly seen abusing commuters caught in the traffic movement.
Protests are a democratic right — abusing the public is not. When did standing up for farmers become an… pic.twitter.com/vYkBnZV5EJ
— Gk (@Ggk_here_) September 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

