‘కందుకూరి ఆశయ సాధనకు ఉద్యమించాలి’
అమరజీవి కందుకూరి నాగేశ్వరరావు ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త ఉద్యమించాలని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం సీపీఎం బూర్గంపహాడ్ మండల నాయకుల కందుకూరి నాగేశ్వరరావు సంస్మరణ సభ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన...
– సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్, సెప్టెంబరు 03 : అమరజీవి కందుకూరి నాగేశ్వరరావు ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త ఉద్యమించాలని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం సీపీఎం బూర్గంపహాడ్ మండల నాయకుల కందుకూరి నాగేశ్వరరావు సంస్మరణ సభ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన పాత సారపాకలో జరిగింది. ఈ సందర్భంగా మచ్చా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, సీపీఎం సీనియర్ నాయకులు చిటికెన ముసలయ్యలతో కలిసి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిస్వార్ధంగా పార్టీకి, ప్రజలకు సేవ చేసిన మహనీయుడు నాగేశ్వరరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నర్సారెడ్డి, అన్నవరపు సత్యనారాయణ, చర్ల మండల కార్యదర్శి మచ్చా రామారావు, కరకగూడెం మండల కార్యదర్శి కొమరం కాంతారావు, ములకలపల్లి సీఐటీయూ కన్వీనర్ నిమ్మల మధు, సీపీఎం మండల కమిటీ సభ్యులు రాయల వెంకటేశ్వర్లు, ఎస్. అబీద, పాండవుల రామనాథం, కనకం వెంకటేశ్వర్లు, గుంటక కృష్ణ, బోళ్ల శ్రీశైలం, మరియమ్మ, అలివేలమ్మ, జానిమియా, చందర్రావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

