Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Tibet Earthquake: టిబెట్‌లో భూకంపం వల్ల 16 మంది మృతిచెందారు. సుమారు 46 మంది గాయపడ్డారు. దాదాపు 339 ఇండ్లు వరకు నేలమట్టం అయినట్లు అధికారులు తెలిపారు. లాసాకు ఈశాన్యం ఉన్న నాగకు ప్రాంతంలో భూమి కంపించింది.
బీజింగ్: టిబెట్‌లో గురువారం రాత్రి భూకంపం(Tibet Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఆ తీవ్రత 7గా నమోదు అయ్యింది. ఆ భూకంపం వల్ల 16 మంది మృతిచెందారు. సుమారు 46 మంది గాయపడ్డారు. దాదాపు 339 ఇండ్లు వరకు నేలమట్టం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. నాగకు ప్రాంతంలో భూమి కంపించింది. రాజధాని లాసాకు ఈశాన్య దిక్కున ఈ ప్రాంతం ఉన్నది. అనేక ప్రాంతాల్లో రోడ్డు మార్గం దెబ్బతిన్నది. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొండ ప్రాంతాల్లోని గ్రామాలు ఇబ్బందిపడుతున్నాయి. సముద్రమట్టానికి 4800 మీటర్ల ఎత్తులో ఉన్న గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. అయితే చైనా ఆధీనంలో టిబెట్ ఉండడం వల్ల. .అక్కడ నుంచి వస్తున్న వార్తలన్నీ చైనా స్క్రీనింగ్ చేస్తోంది.
JUST IN: At least 16 dead, 32 injured and hundreds of homes collapsed after a magnitude 7.0 earthquake struck Tibet, China, officials say. https://t.co/2nTZ5BL4CU
— Scope Report (@ScopeReport_) October 22, 2026
భూకంప ప్రభావిత ప్రాంతంలో సుమారు 1600 మంది స్థానికులు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు. 100 ప్రీఫ్రాబ్రికేటెడ్ హౌజింగ్ యూనిట్లు , 3000 టెంట్లను పంపించారు. ఫ్లాష్లైట్లు, వింటర్ దుస్తుల్ని తరలించారు. ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రైళ్లను ఆపేశారు. జాతీయ రహదారి 317ని స్వల్పంగా మూసివేశారు. అయితే భూకంపం సంభవించిన ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో స్వల్ప స్థాయిలో మంచుకురవనున్నట్లు వెదర్ అధికారులు చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.33 నిమిషాలకు భూకంపం వచ్చింది. సుమారు 18 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
JUST IN: At least 16 dead, 32 injured and hundreds of homes collapsed after a magnitude 7.0 earthquake struck Tibet, China, officials say. https://t.co/2nTZ5BL4CU
— Scope Report (@ScopeReport_) October 22, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

