Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Husband Hug | చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి తన భార్యను ప్రేమతో కౌగిలించుకున్నప్పటికీ ఆమె పక్కటెముకలు విరిగి దవాఖాన పాలయ్యింది. భార్య తనకు చలిగా ఉందని చెప్పడంతో భర్త వాంగ్ ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఉపశమనం కలిగించాడు.
Husband Hug | న్యూఢిల్లీ: చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి తన భార్యను ప్రేమతో కౌగిలించుకున్నప్పటికీ ఆమె పక్కటెముకలు విరిగి దవాఖాన పాలయ్యింది. భార్య తనకు చలిగా ఉందని చెప్పడంతో భర్త వాంగ్ ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఉపశమనం కలిగించాడు. కొంత సేపటికి ఆమెకు ఛాతిలో తీవ్రంగా నొప్పి రావడంతో దవాఖానకు వెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆమె ఐదు పక్కటెముకలు విరిగాయని, ఒకటి పగులు తీసిందని చెప్పారు.
చైనాకు చెందిన జిన్మిన్ ఈవెనింగ్ న్యూస్ సహా పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం.. జియాంగ్స్ ప్రావిన్స్‌లో దుకాణం నిర్వహించే వాంగ్ అనే వ్యక్తి తన 39 ఏండ్ల భార్యను రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె కూడా అతడి మెడ చుట్టూ చేతులు వేసి తిరిగి కౌగిలించుకున్నది. కొద్దిసేపటికే ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుప్పకూలింది. నొప్పి తీవ్రతకు నిలబడటానికీ ఇబ్బంది పడింది. దవాఖానలో వైద్యులు సీటీ స్కాన్ చేయగా మొత్తం ఐదు పక్కటెముకలకు ఫ్రాక్చర్లు ఉన్నట్టు గుర్తించారు. ఎడమవైపు ఐదో నుంచి ఎనిమిదో పక్కటెముకల వరకు, కుడివైపు ఐదో పక్కటెముక ముందు భాగంలో విరుగుళ్లు ఉన్నట్టు తేలింది. ఎడమవైపు రెండో పక్కటెముక ముందు భాగంలోనూ పగులు గుర్తించారు.
బలహీనమైన ఎముకలతోనే ముప్పు
సిచువాన్ ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ చైనీస్ అండ్ వెస్ట్రన్ మెడిసిన్ హాస్పిటల్‌లోని వుహౌవెన్ విభాగం ఆర్థోపెడిక్స్ డిప్యూటీ డైరెక్టర్ లీ బింగ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. కౌగిలింత వంటి స్వల్ప ఒత్తిడికే ఎముకలు విరిగితే వాటి బలం ఇప్పటికే తగ్గిపోయి ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకోవడం, పైకి ఎత్తడం వల్ల ఛాతీపై ఒత్తిడి ఒకేచోట కేంద్రీకృతమవుతుందని వివరించారు. ముఖ్యంగా ఐదు నుంచి ఎనిమిది పక్కటెముకలు వంపు తిరిగి ఉండటం వల్ల బాహ్య ఒత్తిడికి దెబ్బతినే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు.
తన భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్నానని, అలా చేస్తే పక్కటెముకలు విరిగిపోతాయని ఊహించలేదని వాంగ్ తెలిపాడు. భార్య బరువు సుమారు 45 కిలోలు మాత్రమేనని, బరువు తగ్గేందుకు తరచూ రాత్రి భోజనం మానేసేదని చెప్పాడు. ఇద్దరూ కలిసి దుకాణం నిర్వహించడంతో ఆమెకు బయట గడిపే సమయం తక్కువగా ఉండేదని, బయటకు వెళ్లినా ఎండకు దూరంగా ఉండేదని వివరించాడు. వైద్యులు ఆమెకు ఆస్టియోపొరోసిస్ ఉన్నట్టు తెలిపారని, ఎముకలు బలహీనపడటమే ఫ్రాక్చర్లకు కారణమై ఉండవచ్చని పేర్కొన్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

