భారత్ ఎదుగుదలపై చైనా కంటగింపు
భారతదేశ ఆర్థిక, సైనిక ఎదుగుదలను చైనా తన ముందున్న భారీ సవాల్‌గా భావిస్తున్నదని అమెరికా కాంగ్రెస్ కమిషన్ తాజా నివేదిక వెల్లడించింది.
- అమెరికా నివేదికలో సంచలన విషయాలు వెల్లడి
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక, సైనిక ఎదుగుదలను చైనా తన ముందున్న భారీ సవాల్‌గా భావిస్తున్నదని అమెరికా కాంగ్రెస్ కమిషన్ తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌ను బలహీనపరిచేందుకు చైనా పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నదని పేర్కొంది. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సైనిక, సాంకేతిక సహకారం అందించిందని తెలిపింది. చైనా నేరుగా ఘర్షణల్లో పాల్గొనకపోయినా, పాక్ సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడిందని వెల్లడించింది.
చైనా ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన ఇంటర్వ్యూలలో ఆ దేశ విమాన తయారీ సంస్థ ఏవీఐసీ ఇంజినీరింగ్ జాంగ్ హెంగ్ఘర్షణ సమయంలో చైనా నిపుణులు పాకిస్తాన్లో ఉండి, సాంకేతిక సహాయం అందించినట్లు చెప్పారని నివేదిక ప్రస్తావించింది. మరోవైపు భారత్ చైనా మధ్య 2024 అక్టోబర్‌లో సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపునకు ఒప్పందం కుదిరినా, వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా కొత్త సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నదని పేర్కొంది.
అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా వాదనలు, హిందూ మహా సముద్రంలో నౌకాదళ విస్తరణ భారత్‌కు ఆందోళనకరమని తెలిపింది. చైనాపై ఆధారపడుతున్న భారతదేశ పరిస్థితులను బీజింగ్ అనుకూలంగా మలచుకుంటున్నదని తెలిపింది.భారత్-అమెరికా రక్షణ ఒప్పందాల్లోనూ జాప్యం జరుగుతున్నదని, జీఈహెచ్ఏఎల్ ఎఫ్ 414 ఇంజిన్ల తయారీ ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భారత్ ఎదుగుదలపై చైనా కంటగింపు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

