నేను డ్యాన్స్ చేసిన హిట్ సాంగ్స్ అన్ని దాదాపు పీరియడ్స్ సమయంలో చేసినవే: శ్రీలీల
పురుషులతో సమానంగా మహిళలుగా మనం సమాన అవకాశాలు, సమాన అధికారం, సమాన హక్కులు కోరుతున్నప్పుడు నెలసరి సాకుతో ఎలా వెనక్కి పోగలం? నేను డ్యాన్స్ చేసిన హిట్ సాంగ్స్ అన్ని దాదాపు పీరియడ్స్ సమయంలో చేసినవే.
నాకేం కావాలో తనకు మాత్రమే తెలుసు
‘పెళ్లి సందడి’తో టాలీవుడ్లో సందడి చేసిన కన్నడ బ్యూటీ శ్రీలీల తొలి చిత్రంతోనే ఇక్కడి ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. ఆ తర్వాత ధమాకా, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్‌సింగ్ వంటి చిత్రాల్లో అగ్రహీరోల సరసన మెరిసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వచ్చినా ఆ సినిమాలు థియేటర్ల ముందు బోర్లా పడుతున్నాయి. అయినా కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ధనుష్ నటించిన ‘ఓం’ చిత్రంలో మెరిసింది ఈ నటి. ఈ సందర్భంగా శ్రీలీల పంచుకున్న కార్వాన్ కబుర్లివి..
అమెరికాలో పుట్టినా ఇక్కడి పద్ధతులన్నీ నేర్చుకున్నాను. బెంగళూరులో పెరిగినా తాతయ్య నానమ్మలను చూసేందుకు ఒంగోలుకు వస్తుండేదాన్ని. భరతనాట్యం, కూచిపూడితో పాటు మానసిక ఉల్లాసం కోసం హాకీ, స్విమ్మింగ్ నేర్చుకున్నాను. వీటిల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచాను. చదువంటే మరింత ఇష్టం. ఇటీవలే మెడిసిన్ పూర్తి చేశాను.
ఏ భాషలో నటించినా ఆ భాషకు చెందిన సినీ అభిమానులను ఆకట్టుకోవాలన్నది నా సిద్ధాంతం. గతంలో తెలుగులో అలానే చేశాను. ఇప్పుడు తమిళ అభిమానులపై అదే బాణాన్ని గురిపెట్టాను. కచ్చితంగా తమిళ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటాను.
నాకు కాబోయే భర్త గ్లామరస్‌గా లేకపోయినా ఫర్వాలేదు కానీ, నా ఇష్టాలను గౌరవించాలి. నన్ను అర్థం చేసుకొనే మనస్తత్వం కలిగి ఉండాలి. నా సినీ కెరీర్‌కి ఎల్లప్పుడూ మద్దతివ్వాలి. ప్రతి విషయంలో అతను నిజాయితీగా ఉండాలి. నాతో సరదాగా, జోవియల్‌గా సమయాన్ని గడపాలి.

Srileela 1
నేను తల్లిచాటు బిడ్డనని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అదే నిజం. నా స్క్రిప్ట్ సెలక్షన్, డేట్స్ విషయాలను మా అమ్మే చూసుకుంటుంది. ఆమె ప్రోత్సాహంతోనే బాలీవుడ్‌కు ఓకే చెప్పాను. కొంతమంది మా అమ్మ నిర్ణయం తప్పని అభిప్రాయపడినా ఓ తల్లిగా నాకేం కావాలో తనకంటే బాగా ఎవరికి తెలియదని నా భావన.
తమిళంలో నాకిది రెండో సినిమా. పరాశక్తి సినిమా టైంలోనే ఆ భాషపై పట్టు సాధించాను. నా తర్వాతి సినిమా కూడా తమిళంలోనే రాబోతున్నది. సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసి ధర్మన్‌లో మీ ముందుకు వస్తున్నాను. మరింత క్రేజీగా ఉండబోతుంది.
పురుషులతో సమానంగా మహిళలుగా మనం సమాన అవకాశాలు, సమాన అధికారం, సమాన హక్కులు కోరుతున్నప్పుడు నెలసరి సాకుతో ఎలా వెనక్కి పోగలం? మహిళలుగా మనం మన శారీరక, మానసిక పరిమితులను అధిగమించి ముందుకు సాగాలి. మనల్ని మనం ముందుకు నెట్టుకోవాలి. నేను డ్యాన్స్ చేసిన హిట్ సాంగ్స్ అన్ని దాదాపు పీరియడ్స్ సమయంలో చేసినవే.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నేను డ్యాన్స్ చేసిన హిట్ సాంగ్స్ అన్ని దాదాపు పీరియడ్స్ సమయంలో చేసినవే: శ్రీలీల
భారత్ ఎదుగుదలపై చైనా కంటగింపు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

