మాతృ మాండలికంలో పాటలు రాసే అదృష్టం దక్కింది
“భోగి’ తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రం. అక్కడి జీవితాన్ని, పల్లీయుల సంస్కృతిని అచ్చమైన మాండలికంలో ఆవిష్కరించే గొప్ప అదృష్టం ఈ సినిమా పాటల ద్వారా కలిగింది’ అన్నారు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్.
“భోగి’ తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రం. అక్కడి జీవితాన్ని, పల్లీయుల సంస్కృతిని అచ్చమైన మాండలికంలో ఆవిష్కరించే గొప్ప అదృష్టం ఈ సినిమా పాటల ద్వారా కలిగింది’ అన్నారు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్. ఆయన సాహిత్యాన్ని అందించిన పీరియాడిక్ చిత్రం ‘భోగి’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. శర్వానంద్ కథానాయకుడిగా సంపత్‌నంది దర్శకత్వంలో లక్ష్మీ రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా శనివారం చంద్రబోస్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పాటల విశేషాల్ని పంచుకున్నారు.
‘భోగి’ సినిమాలో నా మాతృ మాండలికంలో పాటలు రాయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. గతంలో మల్లేశం, ఛాంపియన్ చిత్రాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాశాను. అయితే ‘భోగి’లో అత్యంత సహజమైన, స్వచ్ఛమైన తెలంగాణ మాండలికంలో పాటలు రాసే అవకాశం దక్కింది. నా బాల్యంలో నేను మాట్లాడినవి, విన్నవి, పరిశీలించిన మాటలను ఈ సినిమా పాటల్లో పొందుపరిచాను.
సినిమా కవి ప్రతి మాండలికంలోనూ పాటను రాసే పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ‘రంగస్థలం’లో గోదావరి యాసను, ‘పుష్ప’ చిత్రంలో చిత్తూరు యాసలో పాటల్ని రాశాను. అయితే ‘భోగి’ సినిమా విషయంలో నాకు ఎవరి దగ్గరి నుంచి ఎలాంటి సమాచారాన్ని తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఒక్కసారి కళ్లుమూసుకుంటే నా ఊరి మూలాల్లోకి వెళ్లిపోతాను. తెలంగాణ మూలాల్లోని తడి నా హృదయం నుంచి ఎప్పటికీ వీడిపోదు.
నేను కాలేజీ రోజుల్లోనే మా ఊరి నుంచి హైదరాబాద్ వచ్చాను. కానీ నా గ్రామం తాలూకు పరిసరాలు, అక్కడి భాష, మాండలికం.. ఇవన్నీ నాలో ఇంకా పదిలంగానే ఉన్నాయి. నా మాతృమాండలికంలో ‘భోగి’ సినిమా పాటలు రాయడం వ్యక్తిగతంగా చాలా సంతోషాన్నిచ్చింది. ఈ కార్యంలో నేను సఫలమయ్యానని భావిస్తున్నా.
ఈ సినిమాలోని ‘ఎగిలివారంగ’ అనే పాటలో పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయే వరకు పల్లెటూరి వారి దినచర్యతో పాటు అక్కడి కులవృత్తులు, దైవిక ఆచారాల్ని తెలియజేసే ప్రయత్నం చేశా. మొత్తంగా ఓ గ్రామ జీవితానికి దర్పణంలా ఈ పాట ఉంటుంది. నా దృష్టిలో ప్రతీ పాట ఓ కథలా ఉండాలి. దానికి అందమైన ప్రారంభం, కొనసాగింపు, ముగింపు ఉండాలి. ‘ఎగిలివారంగా’ పాట విషయంలో ఇవన్నీ చక్కగా కుదిరాయి. సినిమా తాలూకు కథను పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశా.
సంగీత దర్శకుడు భీమ్స్‌తో గతంలో కూడా పనిచేశాను. తను ప్రజల సంగీత దర్శకుడు. నేనంటే చాలా అభిమానం. నా స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చానని చెబుతుంటాడు. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలుంటాయి. అన్నీ సందర్భోచితంగా వచ్చేవే. ఏ పాటకైనా ముందు సాహిత్యం రాసి, ఆ తర్వాత స్వరాల్ని సమకూర్చితే అది ఎక్కువ కాలం నిలుస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప పాటలన్నీ అలా తయారైనవే.
ఆర్.ఆర్.ఆర్‌లో పాటలు రాయడానికి 19 నెలల సమయం తీసుకున్నా. నేను ‘నాటు నాటు’ పాట కంటే ఎన్నో మంచి గీతాలు రాశాను. కానీ ఆ పాటకే ఎందుకు ఆస్కార్ వచ్చిందనే విషయంలో నా దగ్గర ఓ విశ్లేషణ ఉంది. అది ప్రేమగీతం కాదు. బంధాల్ని ఆవిష్కరించే గీతం కాదు. తాత్విక భావాలు ఏమీ లేవు. అది ఒక ఆడిపాడే పాట. అందుకే మిగతా పాటల కంటే ఆ పాట వందకి వంద మార్కులు కొట్టింది. ఆ సంవత్సరం ఈ పాటకు మించిన ఊర్రూతలూగించిన పాట ఏదీరాలేదు. ఆ పాట రాసే విషయంలో నేను చూపించిన సహనానికే అవార్డు వచ్చిందేమో (నవ్వుతూ). గీత రచయితగా 31 ఏండ్ల సాహితీ యజ్ఞంలో భగవంతుడు నన్ను ఆ పాట ద్వారా కరుణించాడేమో అనిపించింది.
ప్రస్తుతం నవతరం గీతరచయితలు మంచి పాటలు రాస్తున్నారు. భాషా పటిమ కంటే సరికొత్త భావాల్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణ పదాల్లోనే లోతైన భావాలు, తాత్వికతను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడొస్తున్న ప్రతీ పాటలకు ఓ ప్రత్యేకత కనిపిస్తున్నది. గీత రచనలో భావవ్యక్తీకరణ కొత్తగా ఉండాలి. భావంలో నవ్యత ఉంటే సాధారణ వ్యవహారిక భాషలోనే అద్భుతమైన పాటల్ని సృష్టించే వీలుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మాతృ మాండలికంలో పాటలు రాసే అదృష్టం దక్కింది
నేను డ్యాన్స్ చేసిన హిట్ సాంగ్స్ అన్ని దాదాపు పీరియడ్స్ సమయంలో చేసినవే: శ్రీలీల
భారత్ ఎదుగుదలపై చైనా కంటగింపు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

