Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Leopard snatches dog | ఒక ఆశ్రమంలోని బెంచ్‌పై కొందరు వ్యక్తులు కూర్చొన్నారు. ఫోన్లు చూడటంలో వారు నిమగ్నమయ్యారు. ఇంతలో ఒక చిరుత అక్కడకు వచ్చింది. ఆ వ్యక్తుల సమీపంలో ఉన్న కుక్క పిల్లను నోటకరుచుకుని క్షణాల్లో మాయమైంది.
గాంధీనగర్: ఒక ఆశ్రమంలోని బెంచ్‌పై కొందరు వ్యక్తులు కూర్చొన్నారు. ఫోన్లు చూడటంలో వారు నిమగ్నమయ్యారు. ఇంతలో ఒక చిరుత అక్కడకు వచ్చింది. ఆ వ్యక్తుల సమీపంలో ఉన్న కుక్క పిల్లను నోటకరుచుకుని క్షణాల్లో మాయమైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Leopard snatches dog) గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 16న సాయంత్రం 7.30 గంటల సమయంలో గిర్నార్ అడవి సమీపంలోని ప్రేరణధామ్ ఆశ్రమం బయట ఉన్న బెంచ్‌పై కొందరు వ్యక్తులు కూర్చొన్నారు. వారు మొబైల్ ఫోన్లు చూస్తున్నారు. మరి కొందరు వ్యక్తులు కూడా అక్కడ నిల్చొని మాట్లాడుకుంటున్నారు.
కాగా, ఆశ్రమం ప్రవేశం వద్ద ఉన్న కార్యాలయం వద్దకు ఒక కుక్క పిల్ల వచ్చింది. బెంచ్‌పై కూర్చొన్న వారి సమీపంలో అది ఉన్నది. ఉన్నట్టుండి ఒక చిరుత అక్కడ ప్రత్యక్షమైంది. ఆ కుక్క పిల్లను నోటకరుచుకుని క్షణాల్లో అక్కడి నుంచి మాయమైంది. అడవిలోకి అది పారిపోయింది.
మరోవైపు ఆ సమీపంలోని బెంచ్‌పై కూర్చొన్న వ్యక్తులకు ఏం జరిగిందో అన్నది అర్థం కాలేదు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కుక్కపై చిరుత దాడి చేసినట్లు తెలుసుకుని వారు షాక్ అయ్యారు. దీంతో ఆశ్రమానికి చెందిన వ్యక్తులు భయాందోళన చెందారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨 LEOPARD SNATCHES DOG NEAR THREE MEN SITTING ON A BENCH IN GUJARAT
A leopard suddenly grabbed a dog near the entrance of Prernadham Ashram in Junagadh, Gujarat and carried it away towards the forest.
Three men were sitting on a nearby bench when the incident occurred on Friday evening. The moment was captured on CCTV.
🎥 CCTV Footage
#Gujarat #Leopard
— contentkikamii (@contentkikamii) October 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

