Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Elephant runs amok | దసరా సందర్భంగా ఏనుగుపై దేవుడిని ఊరేగించేందుకు ప్రయత్నించారు. అయితే సుమారు 650 కిలోల బరువున్న వెండి మండపాన్ని ఆ ఏనుగుపై ఉంచారు. ఈ నేపథ్యంలో అది పరుగులు తీసి బీభత్సం సృష్టించింది.
బెంగళూరు: దసరా సందర్భంగా ఏనుగుపై దేవుడిని ఊరేగించేందుకు ప్రయత్నించారు. అయితే సుమారు 650 కిలోల బరువున్న వెండి మండపాన్ని ఆ ఏనుగుపై ఉంచారు. ఈ నేపథ్యంలో అది పరుగులు తీసి బీభత్సం సృష్టించింది. (Elephant runs amok) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని శివమొగ్గలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం దసరా సందర్భంగా ఒక ఏనుగుపై దేవుడిని ఊరేగించేందుకు సిద్ధం చేస్తున్నారు. సుమారు 650 కిలోల బరువైన వెండి మండపాన్ని అంబారీపై ఉంచారు.
కాగా, ఆ ఏనుగు అదుపుతప్పింది. ఒక్కసారిగా పరుగులు తీసింది. అక్కడ బీభత్సం సృష్టించింది. పలు ఇళ్లు, వాహనాలను అది ధ్వంసం చేసింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. రోడ్లపై ఉన్న జనంతో పాటు పోలీసులు కూడా పరుగులుతీశారు.
మరోవైపు సోమన్నగా పిలిచే ఆ ఏనుగును అదుపు చేసేందుకు పశువైద్యులు ప్రయత్నించారు. చివరకు దానికి మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆ ఏనుగు నియంత్రణలోకి వచ్చింది. శివమొగ్గ జిల్లా ఎస్పీ, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే ఏనుగు బీభత్సం సృష్టించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Dasara procession turns to tragedy in Shivamogga. The elephant carrying the Ambari runs amok across the streets damaging buildings and vehicles before coming to a halt as the 650 kilo silver ambari it was carrying falls down. https://t.co/zQlPX4HuOg
— Deepak Bopanna (@dpkBopanna) October 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

