Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
man drives new car | దసరా పండుగ సందర్భంగా ఒక వ్యక్తి కొత్త కారును కొనుగోలు చేశాడు. ఎంతో ఆనందంతో షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి నడిపిన ఆ కొత్త వాహనం అదుపుతప్పింది. షోరూమ్ నుంచి రోడ్డుపైకి దూసుకెళ్లింది.
బెంగళూరు: దసరా పండుగ సందర్భంగా ఒక వ్యక్తి కొత్త కారును కొనుగోలు చేశాడు. ఎంతో ఆనందంతో షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి నడిపిన ఆ కొత్త వాహనం అదుపుతప్పింది. షోరూమ్ నుంచి రోడ్డుపైకి దూసుకెళ్లింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (man drives new car) కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సాగర్ టౌన్‌కు చెందిన ఒక వ్యక్తి కొత్త వాహనాన్ని కొనుగోలు చేశాడు. మంగళవారం దసరా పండుగ సందర్భంగా షోరూమ్ నుంచి దానిని డెలివరీ తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఎంతో సంతోషంతో కొత్త కారు నడిపి తన ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఆ వ్యక్తి నడిపిన ఆ కొత్త వాహనం అదుపుతప్పింది. షోరూమ్‌కు ఎదురుగా ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టింది. రోడ్డుపైకి వేగంగా దూసుకెళ్లింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ షోరూమ్ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨 A newly delivered car on Dasara lost control near a Maruti showroom in Sagar and hit a bike. The rider and pillion rider were seriously injured and hospitalised. CCTV captured the incident; Sagar Town Police have registered a case and started an investigation.
#Shivamogga #Karnataka— Pulse of the People (@CitizenPulseX) October 20, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

