Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Ranbir Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తన నటనతోనే కాకుండా విలాసవంతమైన జీవనశైలితోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ నటుడు, ఖరీదైన కార్లు, ఇళ్లు, విలాసవంతమైన గడియారాలపై కూడా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘రామాయణ’ సినిమా కార్యక్రమానికి హాజరైన ఆయన ధరించిన ఓ ప్రత్యేకమైన గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది.
Ranbir Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తన నటనతోనే కాకుండా విలాసవంతమైన జీవనశైలితోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ నటుడు, ఖరీదైన కార్లు, ఇళ్లు, విలాసవంతమైన గడియారాలపై కూడా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘రామాయణ’ సినిమా కార్యక్రమానికి హాజరైన ఆయన ధరించిన ఓ ప్రత్యేకమైన గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది. దాని ధర తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. హైదరాబాద్‌లో జరిగిన ‘రామాయణ’ చిత్రానికి సంబంధించిన కార్యక్రమంలో రణ్‌బీర్ కపూర్ నీలిరంగు దుస్తుల్లో కనిపించారు. ఆయన ధరించిన దుస్తులకు సరిపోయేలా ఉన్న గడియారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్విస్ విలాసవంతమైన గడియారాల తయారీ సంస్థ జాకబ్ అండ్ కో రూపొందించిన ‘ఎపిక్ ఎక్స్ షేర్-ఎ-పంజాబ్ ఎడిషన్’ గడియారాన్ని ఆయన ధరించినట్లు సమాచారం. ఈ గడియారం ప్రత్యేకత ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 గడియారాలను మాత్రమే తయారు చేశారు. పంజాబ్ సంప్రదాయం, సిక్కు సమాజ సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబించేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. సంప్రదాయ కళాత్మకతతో పాటు ఆధునిక యాంత్రిక సాంకేతికతను మేళవించి ఈ గడియారాన్ని తయారు చేశారు. ఈ అరుదైన గడియారం భారత మార్కెట్లో సుమారు రూ.35.88 లక్షల ధర పలుకుతున్నట్లు సమాచారం. అంటే ఓ విలాసవంతమైన కారు ధరకు సమానంగా ఈ గడియారం విలువ ఉండటం విశేషం. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటంతో దీనికి మరింత ప్రత్యేకత ఏర్పడింది.
రణ్‌బీర్ కపూర్ వద్ద ఇప్పటికే ఖరీదైన గడియారాల సేకరణ ఉన్నట్లు సినీ, ఫ్యాషన్ వర్గాల్లో ప్రచారం ఉంది. తాజాగా ఈ ప్రత్యేక గడియారంతో ఆయన కనిపించడంతో అభిమానులు, విలాసవంతమైన వస్తువులపై ఆసక్తి ఉన్నవారు దాని గురించి చర్చించుకుంటున్నారు. ఇక రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ విషయానికి వస్తే.. ఇందులో ఆయన శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని 2026 నవంబర్ 5న, రెండో భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

