Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Naresh | టాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నరేష్ తన గత రాజకీయ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హీరోగా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వల్ల ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాల్లో నష్టాలు, సొంత ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.
Naresh | టాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నరేష్ తన గత రాజకీయ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హీరోగా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వల్ల ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాల్లో నష్టాలు, సొంత ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. రాజకీయాల్లోకి తాను డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వెళ్లలేదని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఆ రంగంలోకి అడుగుపెట్టానని తెలిపారు.రాజకీయాల్లో చురుగ్గా పనిచేసిన సమయంలో పార్టీ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల కోసం సొంత డబ్బును విపరీతంగా ఖర్చు చేయాల్సి వచ్చేదని నరేష్ గుర్తుచేసుకున్నారు.
మరోవైపు, ప్రత్యామ్నాయ ఆదాయం కోసం ప్రారంభించిన ప్రకటనల సంస్థ వంటి వ్యాపారాలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని వెల్లడించారు. ఈ పరిణామాల వల్ల ఏర్పడిన నష్టాలను భర్తీ చేసేందుకు తన ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనలో ఉన్న అతి దాతృత్వం కూడా ఆర్థికంగా దెబ్బతినడానికి ఒక కారణమని నరేష్ పేర్కొన్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నామని తన దగ్గరకు వస్తే, తన స్థాయికి మించి సాయం చేసేవాడినని తెలిపారు. “జేబులో పది వేల రూపాయలు ఉంటే.. ఎక్కడి నుంచో తెచ్చి మరీ పదిహేను వేలు ఇచ్చేసే మనస్తత్వం నాది” అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఇతరులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పరిమితికి మించి ఖర్చు చేయడం వల్ల ఒక దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.
అప్పట్లో సంపాదించిన డబ్బును స్థిరాస్తులు, భూముల వంటి వాటిపై పెట్టుబడిగా పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక ప్రణాళిక విషయంలో తగినంత దూరదృష్టి లేకపోవడం కూడా తనకు నష్టాన్ని కలిగించిందని అంగీకరించారు. 1998 ప్రాంతంలో రాజకీయాల్లో పూర్తిస్థాయిలో చురుగ్గా మారిన నరేష్, దాదాపు 12 నుంచి 15 ఏళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆయన కుటుంబంలోనూ రాజకీయపరంగా భిన్నమైన అనుబంధాలు ఉన్నాయి. సూపర్‌స్టార్ కృష్ణ కాంగ్రెస్ భావజాలానికి దగ్గరగా ఉండగా, ఆయన తల్లి విజయనిర్మల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు.అయితే తాను మాత్రం ఆ రెండు పార్టీలకు భిన్నంగా, చిన్నప్పటి నుంచి చదువుకున్న పాఠశాలలు, రామకృష్ణ మిషన్ ప్రభావంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షితుడైనట్లు నరేష్ తెలిపారు. రాజకీయాల్లో సాధారణ కార్యకర్తగా క్షేత్రస్థాయిలో పనిచేశానని, హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

