Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Viral News | ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జీవిగా పేరుగాంచిన 'ఫిన్ వేల్ (Fin whale)' ఆహారం స్వీకరిస్తున్న అద్భుత దృశ్యం ఒకటి కెమెరాకు చిక్కింది. వేల్స్ తీరంలో ఒక జాలరి తన డ్రోన్‌తో ఈ అరుదైన వీడియోను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. వేల్స్‌లోని పెంబ్రోక్‌షైర్ తీరానికి సమీపంలోగల సెల్టిక్ సముద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Viral News : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జీవిగా పేరుగాంచిన ‘ఫిన్ వేల్ (Fin whale)’ ఆహారం స్వీకరిస్తున్న అద్భుత దృశ్యం ఒకటి కెమెరాకు చిక్కింది. వేల్స్ తీరంలో ఒక జాలరి తన డ్రోన్‌తో ఈ అరుదైన వీడియోను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. వేల్స్‌లోని పెంబ్రోక్‌షైర్ తీరానికి సమీపంలోగల సెల్టిక్ సముద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రిస్ మోర్గాన్ (Ris Morgan) అనే స్థానిక జాలరి తన స్నేహితుడితో కలిసి చేపల వేటకు వెళ్లారు.
ఆ సమయంలో సముద్రంలో భారీ తిమింగలం కదలికలను గమనించారు. వెంటనే తన పడవలో ఉన్న డ్రోన్‌ను గాల్లోకి పంపి దానిని చిత్రీకరించారు. ఆ తిమింగలం తన భారీ నోరు తెరిచి, ఒకేసారి వేలాది గ్యాలన్ల నీటిని, క్రిల్‌ను లోపలికి తీసుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన గురించి మోర్గాన్ మాట్లాడుతూ.. “ఇది పూర్తిగా అదృష్టవశాత్త సాధ్యమైంది. పడవ వెనుక నుంచి డ్రోన్‌ను పంపి చూశాం. ఆ దృశ్యం చూడగానే మేమంతా ఎంతో ఉత్సాహానికి లోనయ్యాం” అని తెలిపారు. ఫిన్ వేల్స్ సాధారణంగా 24 మీటర్ల పొడవు వరకు పెరిగి 70-77 టన్నుల బరువు ఉంటాయి.
నిపుణులు ఈ దృశ్యం చాలా అరుదైనదని అభిప్రాయపడుతున్నారు. బంగోర్ యూనివర్సిటీకి చెందిన సముద్ర జీవశాస్త్ర నిపుణురాలు డాక్టర్ మరియాన్నా చిమియెంటి మాట్లాడుతూ.. ఫిన్ వేల్స్ సాధారణంగా చల్లని, లోతైన సముద్ర జలాల్లో ఉంటాయని, అవి తీరానికి ఇంత దగ్గరగా వచ్చి ఆహారం తీసుకోవడం చాలా అరుదైన విషయమని వివరించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో తిమింగలాల వేట, వాటి సంరక్షణ ఆవశ్యకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | జైలులోనే ముస్కాన్ పది నెలల కూతురు.. దత్తత కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన ఇన్ఫ్లుయెన్సర్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

