రుద్రంపూర్, సెప్టెంబర్ 03 : మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రుద్రంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీమ్ ఎస్ఐ రమాదేవి విద్యార్థులకు డయల్ 112, షీ టీమ్స్, టీ-సేఫ్ యాప్, ‘పోలీస్ అక్క’ కార్యక్రమాలపై వివరించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు వేధింపులు, బెదిరింపులు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112కు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్ఐ నాగయ్య, పోలీస్ అక్క టూ టౌన్ ఇన్చార్జి లక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ లచ్చు, కానిస్టేబుల్ శ్రీనివాస్, హెడ్మాస్టర్ బి.బాలాజీ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

బాలికల భద్రతపై రుద్రంపూర్ జడ్పీహెచ్ఎస్లో షీ టీమ్ అవగాహన