నకిరేకల్ సమగ్ర అభివృద్ధికి చర్యలు : ఎమ్మెల్యే వేముల వీరేశం
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసి నకిరేకల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకిరేకల్ లోని వినాయక బంకేట్ హాల్లో జిల్లా అధికారులతో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంలో....
నకిరేకల్, సెప్టెంబర్ 25 : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసి నకిరేకల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకిరేకల్ లోని వినాయక బంకేట్ హాల్లో జిల్లా అధికారులతో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని వేగవంతం చేయాలని, మొదలుపెట్టని పనులను తక్షణమే మొదలు పెట్టాలని, మంజూరు కావాల్సిన వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. నకిరేకల్ లోని వంద పడకల ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు అలాగే రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అంగన్వాడీ భవనాలు, గ్రామ సమాఖ్య భవనాలు కూడా వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఆసిఫ్ నగర్ కెనాల్ కు మరమ్మతులు చేపట్టాలని, ఐటిపాముల, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలను వేగవంతం చేయాలన్నారు.
నకిరేకల్ నియోజకవర్గానికి జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల బ్రాంచ్ ను తీసుకువచ్చే ఆలోచన ఉందని, అందువల్ల 696 సర్వే నంబర్లో ఉన్న 90 ఎకరాల భూమిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులతో కోరారు. అలాగే బొల్లారంలో ఉన్న 300 ఎకరాల ప్రభుత్వ భూమిని సంరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు. నకిరేకల్ లో బస్టాండు, పోలీస్ స్టేషన్ మార్పుకు సంబంధించిన అనుమతిని తక్షణమే మంజూరు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బంది లేకుండా మండలాల వారిగా తాగునీటికి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి, భూగర్భ జలాలు ఎక్కువగా వినియోగిస్తున్న గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా బల్క్ నీటి సరఫరా ఎక్కువ చేసేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెరువుగట్టు, ఐటిపాముల ప్రాంతాలలో గాంజా వినియోగం ఎక్కువగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేక టీం లు ఏర్పాటు చేసి గంజాను అరికట్టేందుకు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
మంజూరైన సబ్ స్టేషన్ల భూ సేకరణను వేగవంతం చేయాలని ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజినీర్ ను కోరారు. ఎక్కడైనా లూస్ వైర్లు ఉన్నా, విద్యుత్ కనెక్షన్ల కోసం డిడీలు కట్టిన వారికి తక్షణమే కనెక్షన్లు మంజూరు చేయాలన్నారు. ఎల్ నినోను దృష్టిలో ఉంచుకుని పశు సంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులను ప్రోత్సహించాలని, పాడి ద్వారా చిన్న, సన్న కారు రైతులు ఎక్కువ లాభపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి మండల స్థాయిలో తక్షణమే ఆత్మ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి శ్వేత, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు, సింగిల్ విండో చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

