Tirumala | శ్రీవారి భక్తుల నిరీక్షణ సమయాన్ని ఆధ్యాత్మిక అనుభూతిగా మార్చేలా ఎక్స్పీరియన్స్ సెంటర్
Tirumala | తిరుమలలో భక్తుల నిరీక్షణ సమయాన్ని మరింత ఆధ్యాత్మికంగా, జ్ఞానదాయకంగా మార్చేందుకు టీటీడీ హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్ పిలిగ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) లో భక్తుల నిరీక్షణ సమయాన్ని మరింత ఆధ్యాత్మికంగా, జ్ఞానదాయకంగా మార్చేందుకు టీటీడీ( TTD) హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్ పిలిగ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ( Pilgrims Experience Center )ను ఏర్పాటు చేసిందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు.
శుక్రవారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్‌ను, నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు స్వామివారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణాలు, ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక అంశాలు తదితరాలను 3డీ, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందించేందుకు ఈ కేంద్రాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే దుర్లభ్ దర్శనం సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్ రియాలిటీకి సంబంధించిన కంటెంట్‌ను రూపొందించారని, భారీ స్థాయిలో భక్తులను ఆకట్టుకునేలా ఈ సాంకేతికతను ఎలా వినియోగించాలన్న అంశంపై మరింతగా కృషి జరుగుతోందని చెప్పారు. భవిష్యత్తులో స్వామివారికి సంబంధించిన కథలు, భక్తుల అనుభవాలు, తిరుమల కొండపై ఉన్న వివిధ విశిష్టతలు, ఆలయ చరిత్ర, నిర్మాణం, పరిపాలన, సేవలు, పురాణాలు, దాతలు తదితర అంశాలపై నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించి ఎప్పటికప్పుడు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
ఎక్స్పీరియన్స్ సెంటర్లో నిరంతరం కొత్త కంటెంట్ అందుబాటులో ఉండేలా ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని అదనపు ఈవో తెలిపారు. పురాణాలు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం, స్వామివారి సేవలు, భక్తుల కథలు, ఆలయ నిర్మాణం, చరిత్ర, పరిపాలన, దాతల సేవలు తదితర అంశాలపై విభిన్న కథనాలను రూపొందించి క్రమం తప్పకుండా ప్రసారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దీంతో భక్తులు దర్శనానికి వెళ్లే ముందు స్వామివారి గురించి, తిరుమల ఆలయం గురించి, ఇక్కడి సంప్రదాయాలు, సేవలు, చరిత్ర గురించి మరింత తెలుసుకుని ఆధ్యాత్మిక పరిపూర్ణత, సంతృప్తితో దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

