Asian Games : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అదుర్స్ అనిపిస్తున్నారు. ఒకరిద్దరు విఫలమైనా.. మిగతావారు మాత్రం అంచనాలు అందుకుంటూ పతకాలు కొల్లగొడుతున్నారు. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్(Gulveer Singh) రజతంతో మెరిసిన కాసేపటికే బరానికా ఎలంగోవన్ (Baranica Elangovan) చరిత్రాత్మక పతకం సాధించింది. ఎన్నడూ ఆసియాడ్‌లో పతకం గెలవని పోల్ వాల్ట్‌లో అద్భుతం చేసిన తను కాంస్యంతో మెరిసింది. తద్వారా ఈ ఆటలో మన దేశానికి మొట్టమొదటి పతకం అందించిన అథ్లెట్‌గా అవతరించిందీ 29 ఏళ్ల తమిళ వనిత.
జపాన్‌లోని నగోయలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు అథ్లెట్లు. ఒకరితర్వాత ఒకరు పోడియం మీద నిలుస్తూ యావత్ భారతావనిని పులకింపజేస్తున్నారు. మహిళల 10 వేల మీటర్ల పరుగులో నిన్న సీమా కుమారి 16 ఏళ్ల కరువు తీర్చుతూ పతకం ఒడిసిపట్టగా.. ఈసారి బరానిక ఎలంగోవన్ పోల్ వాల్ట్‌లో చరిత్ర లిఖించింది. ఆసియా క్రీడల్లో ఇప్పటివరకూ పోల్‌వాల్ట్‌లో ఎవరూ సాధించిన ఘతన సొంతం చేసుకుంటూ పతకంతో మురిసింది.
BARANICA ELANGOVAN MAKES HISTORY! 🇮🇳
Baranica Elangovan clears 4.15m to win BRONZE at the Asian Games — becoming India’s first-ever Asian Games medallist in pole vault, across both men and women.
Baranica and Polina Ivanova both cleared 4.15m but failed at 4.25m, earning them…
— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 25, 2026
శుక్రవారం జరిగిన ఫైనల్లో అబ్బురపరిచే విన్యాసం చేసింది బరానిక. ఒత్తిడిని జయించి.. గుండెనిండా ఆత్మవిశ్వాసంతో 4.15 మీటర్ల ఎత్తు దూకింది. దాంతో.. మూడో స్థానం ఖాయమవ్వగా.. ఈ విభాగంలో భారత్‌కు మొట్టమొదటి పతకం వచ్చింది. జాతీయ స్థాయిలో రికార్డులు నెలకొల్పిన బరానిక ఈసారి ఆసియాడ్‌లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. దాంతో.. ప్రస్తుతం ఈ తమిళ మహిళ పేరు నెట్టింట మార్మోగిపోతోంది.