Weight Loss | ఎలాంటి కారణాలు లేకుండానే బరువు తగ్గుతున్నారా.. అది క్యాన్సర్‌కు సూచన అవుతుందా..?
ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం కొన్నిసార్లు శరీరంలో దాగి ఉన్న ఆరోగ్య సమస్యలకు సంకేతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బరువు తగ్గడంతోపాటు సాధారణ రక్త పరీక్షల్లో వరుసగా మార్పులు కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయకూడదని తాజా అధ్యయనం సూచిస్తోంది.
Weight Loss | ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం కొన్నిసార్లు శరీరంలో దాగి ఉన్న ఆరోగ్య సమస్యలకు సంకేతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బరువు తగ్గడంతోపాటు సాధారణ రక్త పరీక్షల్లో వరుసగా మార్పులు కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయకూడదని తాజా అధ్యయనం సూచిస్తోంది. వయస్సు, లింగాన్ని పరిగణనలోకి తీసుకుని రక్త పరీక్షలలో కాలక్రమేణా వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా క్యాన్సర్ ముప్పును గుర్తించే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. సాధారణ పరీక్షల్లో కనిపించే మార్పులను విడివిడిగా కాకుండా, గత పరీక్షలతో పోల్చి పరిశీలించడం ద్వారా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే సమాచారాన్ని పొందవచ్చని అధ్యయనం పేర్కొంది.
రక్త పరీక్షల మార్పులు, క్యాన్సర్ ముప్పు..
యూకేలో నిర్వహించిన ఈ పరిశోధనలో 2.75 లక్షల మందికి పైగా రోగుల సమాచారాన్ని పరిశీలించారు. వీరిలో దాదాపు 14 వేల మందికి ఆరు నెలల్లో క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఒక్కసారి చేసిన రక్త పరీక్షలో కనిపించే అసాధారణ ఫలితాలతోపాటు, వరుస పరీక్షల్లో చోటుచేసుకున్న మార్పులు క్యాన్సర్ నిర్ధారణతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో పరిశోధకులు విశ్లేషించారు. మొత్తం 26 రకాల రక్త పరీక్షల మార్పులు క్యాన్సర్ ముప్పుతో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు. వయస్సు, లింగాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ మార్పులు క్యాన్సర్‌ను గుర్తించడంలో ఒక్కసారి కనిపించే అసాధారణ ఫలితాల కంటే మరింత ఉపయోగకరంగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.
ఎలాంటి క్యాన్సర్ అనేది తెలుస్తుందా..
కొన్ని రక్త పరీక్షలలో వచ్చే మార్పులు నిర్దిష్ట రకాల క్యాన్సర్లతో సంబంధం ఉన్నట్లు కూడా అధ్యయనంలో గుర్తించారు. తెల్ల రక్తకణాలు, న్యూట్రోఫిల్స్లో వచ్చే మార్పులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉండగా, ఎర్ర రక్తకణాల సంఖ్య, హీమటోక్రిట్, ప్లేట్లెట్-లింఫోసైట్ నిష్పత్తిలో మార్పులు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఎంసీవీ అనే రక్త సూచికలో వచ్చే మార్పులు పేగు క్యాన్సర్, లింఫోమాతో సంబంధం ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. రక్త పరీక్షల్లో ఒక్కసారి కనిపించే స్వల్ప మార్పులకంటే, కాలక్రమంలో అవి ఎలా మారుతున్నాయో గమనించడం మరింత సమాచారాన్ని అందిస్తాయని అధ్యయనం సూచించింది.
ఇతర కారణాలు కూడా ఉండే చాన్స్..
అయితే రక్త పరీక్షల్లో ఇలాంటి మార్పులు కనిపించినంత మాత్రాన క్యాన్సర్ ఉందని అర్థం కాదు. బరువు తగ్గడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉండే వీలు ఉంటుంది. ఈ అధ్యయనం ప్రధానంగా కారణం తెలియకుండా బరువు తగ్గుతున్న వ్యక్తుల్లో సాధారణ రక్త పరీక్షల ఫలితాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించి, తదుపరి క్యాన్సర్ పరీక్షలు అవసరమైన వారిని గుర్తించే అవకాశంపై దృష్టి పెట్టింది. అందువల్ల వివరించలేని బరువు తగ్గడం కొనసాగితే, రక్త పరీక్షల ఫలితాలను వైద్య నిపుణుల సలహాతో పరిశీలించుకోవడం, అవసరమైతే తదుపరి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
Jumanji: Open World | థ్రిల్లింగ్ అడ్వెంచర్‌తో వస్తోన్న ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. తెలుగు ట్రైలర్ విడుదల!
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

