IndiGo Pilot Falls Ill | ఇండిగో ఫ్లైట్ గాలిలో ఉండగా పైలట్‌కు అస్వస్థత.. అత్యవసరంగా దారి మళ్లింపు
IndiGo Pilot Falls Ill | ఇండిగో విమానం గాలిలో ఉండగా పైలట్ అస్వస్థత చెందారు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. అందులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు కొత్త సిబ్బందితో కూడిన మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.
న్యూఢిల్లీ: ఇండిగో విమానం గాలిలో ఉండగా పైలట్ అస్వస్థత చెందారు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. అందులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు కొత్త సిబ్బందితో కూడిన మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. (IndiGo Pilot Falls Ill) గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఖతార్ రాజధాని దోహా నుంచి బెంగళూరు వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్ అయ్యింది. అయితే దోహా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన రెండు గంటల తర్వాత ఆ విమానం గాలిలో ఉండగా ఒక పైలట్ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ‘మేడే’ అని ప్రకటించారు.
కాగా, ఆ ఇండిగో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. ఒమన్ రాజధాని మస్కట్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అక్కడ చిక్కుకున్న ప్రయాణికులను బెంగళూరు తరలించేందుకు ప్రత్యామ్నాయ విమానం, కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. తమ ప్రయాణికులు, సిబ్బంది, విమానం భద్రతకు అత్యంత ప్రాధాన్యత అని ఇండిగో ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

