Health Tips | రాత్రి పడుకునే ముందు ఇవి తింటే ఆరోగ్యానికి హానికరం..!
Health Tips | మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కానీ నేటి జీవితంలో చాలామంది నిద్రలేమి (Sleeplessness) తో బాధపడుతున్నారు. మనం తినే ఆహారం (Food) కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రలేమీతో క్రమక్రమంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అందుకే రాత్రిపూట కొన్ని ఆహారాలను తీసుకోవడం మానుకుంటే కంటినిండా నిద్రపోవచ్చు.
Health Tips : మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కానీ నేటి జీవితంలో చాలామంది నిద్రలేమి (Sleeplessness) తో బాధపడుతున్నారు. మనం తినే ఆహారం (Food) కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రలేమీతో క్రమక్రమంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అందుకే రాత్రిపూట కొన్ని ఆహారాలను తీసుకోవడం మానుకుంటే కంటినిండా నిద్రపోవచ్చు. మరి రాత్రి పడుకునే ముందు తినకూడని ఆ ఆహారపదార్థాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..
కెఫీన్ ఉన్నవి
కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్లు వంటి వాటిలో కెఫీన్ ఉంటుంది. ఇవి మెదడును చురుకుగా ఉంచి నిద్ర పట్టకుండా చేస్తాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు వీటికి దూరంగా ఉండటం మంచిది.
మసాలాలు, వేపుళ్లు
మసాలాలు, వేయించిన ఆహారం తింటే కడుపులో మంట, ఎసిడిటీ కలుగుతుంది. దాంతో నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. పిజ్జా, బర్గర్, మటన్ వంటి ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇవి కూడా నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉండాలి.
చక్కెర పదార్థాలు
అదేవిధంగా కేకులు, స్వీట్లు తింటే రక్తంలో చక్కెర పెరిగి నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి వాటిని కూడా రాత్రి పడుకునే ముందు అస్సలు తినకూడదు.
ఎసిడిటీ ఫుడ్స్
నిమ్మకాయ, నారింజ, టమోటా వంటి వాటిని రాత్రిపూట తింటే గుండెల్లో మంట కలుగుతుంది. ఎందుకంటే వాటిలో ఆమ్లాలు ఉంటాయి. అందుకే మంటగా అనిపిస్తుంది. అదేవిధంగా బ్రకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటివి తింటే కడుపులో గ్యాస్ ఏర్పడి నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.
ఆల్కహాల్
మద్యం తాగితే మొదట నిద్ర వచ్చినట్టు అనిపించినా తర్వాత నిద్ర సరిగా ఉండదు. కాబట్టి రాత్రి పడుకునే ముందు మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

