లక్నో: భర్త మద్యం సేవించడంపై భార్య ఆగ్రహించింది. అతడ్ని మంచానికి కట్టేసింది. చేతిలోని తుపాకీతో భర్తను బెదిరించింది. ఇది చూసి ఆమె అత్త ఆందోళన చెందింది. కోడలు వద్ద గన్ ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. (Woman Ties Husband To Bed) ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హమీద్పూర్ గ్రామానికి చెందిన ప్రదీప్‌కు, రసూల్‌పూర్‌కు చెందిన సోనీతో నాలుగేళ్ల కిందట పెళ్లి జరిగింది. అయితే గత రెండేళ్లుగా భర్త, అత్తను ఆమె వేధిస్తున్నది.
కాగా, మద్యం సేవించిన భర్త ప్రదీప్‌పై భార్య సోనీ ఆగ్రహించింది. అతడ్ని మంచానికి కట్టేసింది. చేతిలోని దేశీయ తుపాకీతో కాల్చి చంపుతానని భర్తను బెదిరించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రదీప్ తల్లి స్థానికులతో కలిసి ఆ ఇంటికి చేరుకున్నది. మంచానికి కట్టేసిన కుమారుడి కట్లు విడదీసింది. కోడలు సోని చేతిలో దేశీయ తుపాకీ ఉండటం చూసి ఆమె షాక్ అయ్యింది. సోనీ చేసిన హంగామాను స్థానికులు వీడియో రికార్డ్ చేశారు.
మరోవైపు ప్రదీప్ తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కోడలు తన కుమారుడ్ని మంచానికి కట్టేపి తుపాకీతో చంపుతానని బెదిరించినట్లు ఆరోపించింది. ఆ తర్వాత గన్ను ఎక్కదో ఆమె దాచినట్లు తెలిపింది.
గత రెండేళ్లుగా కుమారుడు, తనను వేధిస్తున్న కోడలిపై గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆ మహిళ విమర్శించింది. ఈసారి వీడియో, ఫొటో ఆధారాలను పోలీసులకు అందజేసింది. కొడుకును, తనను చంపుతానని కోడలు బెదిరిస్తున్నదని ఆరోపించింది. సోనీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీడియో, ఫొటో ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP Woman Ties Husband To Bed, Mother-In-Law Shows Cops Her Pic With Gun https://t.co/8I6zGHEmMl pic.twitter.com/uCp3h2XqJK
— NDTV (@ndtv) January 23, 2026
Also Read:
Diaper Saves Baby | పసిబిడ్డను బావిలో పడేసిన కోతి.. మునిగిపోకుండా కాపాడిన డైపర్
Student Suicide In Classroom | ప్రైవేట్ కాలేజీ క్లాస్‌రూమ్‌లో.. విద్యార్థిని ఆత్మహత్య
Watch: బిజీ రోడ్డులో కారును అడ్డుకుని.. మహిళను కిడ్నాప్
contaminated water | కలుషిత తాగునీటి వల్ల.. ఇండోర్ జిల్లాలో 24 మందికి అస్వస్థత