Retirement Benefits | గజ్వేల్, ఫిబ్రవరి 27: ‘నా డబ్బులు నాకివ్వండి’ అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు ఓ రిటైర్డ్ ఎస్సై. పోలీస్‌శాఖలో 38 ఏండ్లపాటు విధులు నిర్వర్తించి, ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ బెన్ఫిట్స్ రూ.60 లక్షలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా జీవితాన్ని పా రంభించి, నిరుడు ఏప్రిల్‌లో గౌరారం ఎస్సై-2గా రిటైరయ్యాడు. తనకు రా వాల్సిన బకాయిలు రాకపోవడంతో ఆ ర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం భార్యకు హైదరాబాద్‌లోని కిమ్స్ దవాఖానలో వైద్యం చే యించాడు. తరువాత తన ఆరోగ్యం దెబ్బతినడంతో కిమ్స్‌లో నిరుడు డి సెంబర్‌లో మెడ వద్ద సర్జరీ చేయించుకుంటే రూ.10లక్షలు ఖర్చు అయ్యింది. తన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నాడు.