Wine | వైన్ తాగే వారిలో రక్తనాళాల్లో తగ్గిన కొవ్వు నిల్వలు.. అధ్యయనంలో వెల్లడి..
మధుమేహంతో బాధపడుతున్నవారిలో గుండె సంబంధిత సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు, ఇతర పదార్థాలు పేరుకుపోయి ప్లాక్ ఏర్పడటం వల్ల రక్తప్రసరణకు ఆటంకం కలుగుంది. అయితే వైన్‌ను పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల కొంతమంది మధుమేహుల్లో రక్తనాళాల్లో పేరుకుపోయిన ప్లాక్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనం సూచించింది.
Wine | మధుమేహంతో బాధపడుతున్నవారిలో గుండె సంబంధిత సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు, ఇతర పదార్థాలు పేరుకుపోయి ప్లాక్ ఏర్పడటం వల్ల రక్తప్రసరణకు ఆటంకం కలుగుంది. అయితే వైన్‌ను పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల కొంతమంది మధుమేహుల్లో రక్తనాళాల్లో పేరుకుపోయిన ప్లాక్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనం సూచించింది. యురోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, రక్తనాళాల్లో ఇప్పటికే ప్లాక్ ఉన్న మధుమేహ బాధితులను పరిశీలించారు. అధ్యయనం ప్రారంభంలో రక్తనాళాల్లో ఎక్కువగా ప్లాక్ ఉన్నవారిలో, రెండు సంవత్సరాల తర్వాత ఈ పేరుకుపోయిన పదార్థాల్లో స్వల్పమైనప్పటికీ గణనీయమైన తగ్గుదల కనిపించింది.
2 ఏళ్ల తరువాత తేడాలు..
అయితే రెండు సంవత్సరాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్షల్లో పాల్గొన్నవారి రక్తనాళాల్లో ప్లాక్ గణనీయంగా పెరిగినట్లు కనిపించలేదు. వారు వైన్ తీసుకున్నా, తీసుకోకపోయినా ఈ విషయంలో పెద్దగా తేడా కనిపించలేదు. అయితే అధ్యయనం ప్రారంభంలో రక్తనాళాల్లో ఎక్కువ మొత్తంలో ప్లాక్ ఉన్నవారిలో మాత్రం అధ్యయనం ముగిసే సమయానికి ఈ నిక్షేపాలు కొంత తగ్గినట్లు గుర్తించారు. మధుమేహంతోపాటు రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి కార్డియో-మెటబాలిక్ సమస్యలు గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశాన్ని పెంచుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుపోవడం కూడా ఇలాంటి ప్రమాద కారకాలలో ఒకటిగా ఉంటుంది. గతంలో నిర్వహించిన కొన్ని పరిశోధనలు కూడా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వైన్‌ను పరిమితంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సూచించాయి. అయితే దీనిని వైన్ తాగడం ఆరోగ్యానికి తప్పనిసరిగా మంచిదనే అర్థంలో తీసుకోకూడదు.
ప్రమాదాలు కూడా ఉంటాయి..
మద్యం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రయోజనం ఉంటుందని కనిపించినప్పటికీ, దానికి అనేక ఇతర ఆరోగ్యపరమైన ప్రమాదాలు కూడా ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గే అవకాశంతోపాటు, గుండె లయలో మార్పులు ఏర్పడి స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల వైన్‌ను ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మార్గంగా భావించి అలవాటుగా మార్చుకోవడం సరికాదు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతోపాటు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. మద్యం తీసుకోవడం వ్యక్తిగత ఎంపిక అయినప్పటికీ, దాన్ని క్రమం తప్పకుండా తీసుకునే అలవాటుగా మార్చుకోకుండా జాగ్రత్త వహించడం అవసరమని తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

