అహ్మదాబాద్: ప్రైవేట్ కాలేజీ క్లాస్‌రూమ్‌లో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. క్యాంపస్‌లోని హాస్టల్లో నివసించే ఆమె కనిపించకపోవడంతో అంతా వెతికారు. చివరకు ఖాళీ తరగతి గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు విద్యార్థిని మృతదేహం వేలాడుతుండటాన్ని గమనించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Student Suicide In Classroom) గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పటాన్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల శివానీ అహిర్, బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నది. గాంధీనగర్ సెక్టార్ 7లోని జేఎం చౌదరి బాలికల హాస్టల్లో ఆమె నివసిస్తున్నది.
కాగా, జనవరి 21న సాయంత్రం ఆ ప్రైవేట్ కాలేజీ ప్రాంగణంలోని హాస్టల్ నుంచి శివానీ అదృశ్యమైంది. ఆమె కనిపించకపోవడంతో కాలేజీ యాజమాన్యం, సిబ్బంది వెతకడం ప్రారంభించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో శివానీ తల్లిదండ్రులు, పోలీసులు కాలేజీ క్యాంపస్‌కు చేరుకున్నారు. ఆమె కోసం వెతకగా ఖాళీ క్లాస్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న శివానీ మృతదేహం కనిపించింది.
మరోవైపు ఆ క్లాస్‌రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. శివానీ ఒక బల్లపై నిలబడి సీలింగ్ ఫ్యాన్‌కు స్కార్ఫ్ కట్టింది. ఆ తర్వాత కిందకు దిగింది. కొద్దిసేపు మొబైల్ ఫోన్ చూసింది. మళ్లీ బల్లపైకి ఎక్కింది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిని శివానీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆమె ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Watch: జూనియర్లపై దాడి, ర్యాగింగ్.. 23 మంది సీనియర్ విద్యార్థులపై కేసు
Diaper Saves Baby | పసిబిడ్డను బావిలో పడేసిన కోతి.. మునిగిపోకుండా కాపాడిన డైపర్
contaminated water | కలుషిత తాగునీటి వల్ల.. ఇండోర్ జిల్లాలో 24 మందికి అస్వస్థత
Watch: బిజీ రోడ్డులో కారును అడ్డుకుని.. మహిళను కిడ్నాప్