Dharmapuri Arvind | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రైవేట్ స్థలా లు, బడా బిల్డర్లే టార్గెట్గా సీఎం రేవం త్ బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేశారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నలుగురు అడ్వకేట్లను పెట్టుకొని స్థలాలపై వివాదాలు సృష్టించి కోర్టుకు వెళ్లి బెదిరింపులకు ది గుతున్నారని మండిపడ్డారు. ఆ తర్వా త వారిని పిలిచి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇది తప్ప సీఎంకు పాలనపై పట్టులేదని విమర్శించారు.