ముంబై: లోకల్ ట్రైన్లో ప్రయాణించిన ప్రొఫెసర్, ఒక ప్రయాణికుడి మధ్య గొడవ జరిగింది. ఆ రైలు స్టేషన్ చేరుకోగా దిగేటప్పుడు కూడా వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత జనంలో కలిసిపోయి పారిపోయాడు. (Professor Stabbed At Station) సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ద్వారా ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. విలే పార్లేలోని ప్రముఖ కాలేజీలో ప్రొఫెసర్‌గా అలోక్ సింగ్ పని చేస్తున్నారు. శనివారం లోకల్ ట్రైన్లో ఆయన ప్రయాణించారు.
కాగా, రైలులో సీటు విషయంలో ఒక ప్రయాణికుడు, ప్రొఫెసర్ అలోక్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ట్రైన్ మలాడ్ స్టేషన్ చేరగానే దిగే సమయంలో గేటు వద్ద తోపులాట వల్ల వారిద్దరి మధ్య ఘర్షణ ముదిరింది. రైలు దిగిన ఆ వ్యక్తి కత్తి బయటకు తీశాడు. కంపార్ట్మెంట్ గేట్ వద్ద ఉన్న ప్రొఫెసర్ అలోక్ సింగ్ కడుపులో పలుమార్లు పొడిచాడు. స్టేషన్‌లోని జనం రద్దీలో కలిసిపోయి పారిపోయాడు.
మరోవైపు కత్తి గాయాల వల్ల తీవ్ర రక్తస్రావమైన అలోక్ సింగ్, ఆ కోచ్ గేటు వద్ద కుప్పకూలి మరణించాడు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అలోక్ సింగ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కత్తి దాడి తర్వాత పారిపోయిన ఆ వ్యక్తిని 27 ఏళ్ల ఓంకార్ షిండేగా పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో వాసాయిలో అతడు ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు.
అయితే రైలులో సాధారణంగా జరిగే చిన్న గొడవకే ప్రొఫెసర్ అలోక్ సింగ్‌ను ఓంకార్ షిండే దారుణంగా కత్తితో పొడిచి చంపడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరి మధ్య గతంలో శతృత్వం ఉన్నదా? లేక ఆయన హత్య వెనుక ఇతర నేర కోణం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
In a chilling reminder of the volatility within #Mumbai‘s crowded transit system, the Government Railway Police (GRP) have arrested 27-year-old #OmkarShinde for the brutal murder of a college professor at Malad Railway Station.
The victim, #AlokSingh, was a professor at a… pic.twitter.com/wk0wa2Nk0p
— Hate Detector 🔍 (@HateDetectors) January 25, 2026
Malad Railway Station : लोकलमधून उतरण्यावरुन किरकोळ वाद, मुंबईतल्या स्टेशनवर भरदिवसा प्राध्यापकाला संपवलं; आरोपीचा पळतानाचा Video समोर pic.twitter.com/4ZQ9duBU3J
— Maharashtra Times (@mataonline) January 25, 2026
Also Read:
Father Beat Daughter To Death | 50 వరకు అంకెలు చెప్పలేదని.. కుమార్తెను కొట్టి చంపిన తండ్రి
Watch: ప్రియుడిని పెట్టెలో దాచిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?