చండీగఢ్: కుమార్తె 50 వరకు అంకెలు చెప్పలేకపోవడంపై తండ్రి ఆగ్రహించాడు. చపాతీ కర్రతో కొట్టి చంపాడు. ప్రమాదవశాత్తు మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అనుమానించిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. (Father Beat Daughter To Death) ఉత్తరప్రదేశ్‌కు చెందిన కృష్ణ జైస్వాల్ తన కుటుంబంతో కలిసి హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా ఝర్సెంథాలీ గ్రామంలోని అద్దె ఇంట్లో చాలా కాలంగా నివసిస్తున్నాడు. భార్యాభర్తలు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఏడేళ్ల కొడుకు, నాలుగు, రెండేళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కాగా, జనవరి 21న నాలుగేళ్ల కుమార్తె స్కూల్‌కు వెళ్లలేదు. ఇంట్లోనే ఉన్న కృష్ణ జైస్వాల్ ఆ చిన్నారికి లెక్కలు బోధించాడు. అయితే కుమార్తె 50 వరకు అంకెలు చెప్పకపోవడంతో అతడు ఆగ్రహించాడు. వంటింట్లోని చపాతీ కర్రతో ఆ చిన్నారిని దారుణంగా కొట్టాడు.
మరోవైపు ఆ బాలిక స్పృహ కోల్పోయింది. ఆందోళన చెందిన తండ్రి కృష్ణ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిశీలించిన డాక్టర్లు ఆ చిన్నారి మరణించినట్లు తెలిపారు. దీంతో భార్యకు అతడు ఫోన్ చేశాడు. కుమార్తె ఆడుకుంటూ మెట్ల పైనుంచి కిందపడి చనిపోయినట్లు చెప్పాడు.
అయితే పనికి వెళ్లిన భార్య వెంటనే ఆసుపత్రికి చేరుకున్నది. కుమార్తె శరీరంపై పలు గాయాలు ఉండటాన్ని గమనించింది. భర్త కొట్టి చంపినట్లు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కృష్ణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Indian man shoots wife, relatives | అమెరికాలో భార్య, ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ వ్యక్తి
Man Tries To Burn Daughter-In-Law | ఆడ పిల్లకు జన్మనిచ్చిందని.. కోడలికి నిప్పంటించేందుకు మామ యత్నం
Blast At railway line in Punjab | గూడ్స్ రైలు వెళ్తుండగా.. రైలు పట్టాలపై పేలుడు, ట్రాక్ ధ్వంసం