వాషింగ్టన్: అమెరికాలో నివసించే భారతీయ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా భార్య, ముగ్గురు బంధువులను కాల్చి చంపాడు. భయాందోళన చెందిన ఇరు కటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు అల్మారాలో దాక్కున్నారు. (Indian man shoots wife, relatives) అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. 51 ఏళ్ల విజయ్ కుమార్, 43 ఏళ్ల భార్య మీము డోగ్రా, 12 ఏళ్ల చైల్డ్‌తో కలిసి అట్లాంటాలో నివసిస్తున్నాడు. వారి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
కాగా, శుక్రవారం విజయ్ కుమార్ తన కుటుంబంతో కలిసి బ్రూక్ ఐవీ కోర్ట్‌లోని బంధువుల ఇంటికి కారులో వెళ్లాడు. అక్కడ భార్య, బంధువులతో మరింత గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్య మీము, బంధువులైన 33 ఏళ్ల గౌరవ్ కుమార్, 37 ఏళ్ల నిధి చందర్, 38 ఏళ్ల హరీష్ చందర్‌ను గన్‌తో కాల్చి చంపాడు.
మరోవైపు విజయ్ కుమార్ సంతానంతోపాటు బంధువుల కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ఈ కాల్పుల ఘటనతో భయాందోళన చెందారు. ప్రాణ భయంతో ఆ ఇంటిలోని అల్మారాలో వారు దాక్కున్నారు. విజయ్ కుమార్ చైల్డ్ 911కు ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. కాల్పుల్లో అతడి భార్య, ముగ్గురు బంధువులు మరణించినట్లు గ్రహించారు.
కాగా, అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన విజయ్ కుమార్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై హత్య వంటి తీవ్ర నేరారోపణల కింద కేసు నమోదు చేశారు. అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందిస్తున్నట్లు పేర్కొంది.
Also Read:
Skeleton In Luggage | లగేజీ బ్యాగ్‌లో అస్థిపంజరం.. ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
Diaper Saves Baby | పసిబిడ్డను బావిలో పడేసిన కోతి.. మునిగిపోకుండా కాపాడిన డైపర్
Watch: భర్తను మంచానికి కట్టేసిన భార్య.. తర్వాత ఏం చేసిందంటే?