భువనేశ్వర్: కోడలు ఆడ పిల్లకు జన్మనివ్వడంపై మామ ఆగ్రహించాడు. నిద్రిస్తున్న తల్లీ, బిడ్డపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి ప్రయత్నించాడు. అయితే నవజాత శిశువుతో కలిసి ఆ మహిళ మంటల నుంచి తప్పించుకున్నది. ఆ ఇంటి నుంచి పారిపోయింది. పసి బిడ్డతో కలిసి రాత్రంతా బయటే ఉన్నది. (Man Tries To Burn Daughter-In-Law) ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దమర్పూర్ గ్రామానికి చెందిన సుశాంత రాయ్‌తో, నిశ్చింతకోయిలి బలిపాడు గ్రామానికి చెందిన సుస్మితకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. భర్త సుశాంత్‌కు గత వివాహం ద్వారా ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కాగా, ఇటీవల సుస్మిత ఆడ పిల్లకు జన్మనిచ్చింది. 75 ఏళ్ల మామ ప్రఫుల్లా రాయ్ దీనిపై ఆగ్రహించాడు. సమీప గ్రామం నుంచి పెట్రోల్ కొనుగోలు చేశాడు. రాత్రి వేళ బిడ్డతో కలిసి మంచంపై నిద్రిస్తున్న కోడలు సుస్మితపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
మరోవైపు గదిలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సుస్మిత మేల్కొన్నది. వెంటనే తన పసి కుమార్తెను తీసుకుని బయటకు పరుగెత్తింది. సకాలంలో మంటల నుంచి తప్పించుకున్నది. రోజుల బిడ్డతో రాత్రంతా బయటే ఉన్నది.
అయితే మంటలకు ఆ ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆడ పిల్ల పుట్టినప్పటి నుంచి సుస్మితను భర్త, మామ వేధిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. తల్లీ, బిడ్డను సజీవ దహనానికి యత్నించిన మామ ప్రఫుల్లా రాయ్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Indian man shoots wife, relatives | అమెరికాలో భార్య, ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ వ్యక్తి
Diaper Saves Baby | పసిబిడ్డను బావిలో పడేసిన కోతి.. మునిగిపోకుండా కాపాడిన డైపర్
Watch: బిజీ రోడ్డులో కారును అడ్డుకుని.. మహిళను కిడ్నాప్