Thalapathy Vijay | తమిళనాడులో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుంటే మరోవైపు నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్-సంగీత దంపతుల విడాకుల అంశం హాట్ టాపిక్‌గా మారిందని తెలిసిందే. విజయ్ నుంచి విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత.. చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ సినీ నటితో విజయ్‌కున్న వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని విడాకుల పిటిషన్లో సంగీత పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణకు అంగీకరించిన కోర్టు ఏప్రిల్ 20న కోర్టుకు రావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ వ్యవహారంలో విజయ్ సెటిల్మెంట్కు ఒప్పుకున్నాడని.. సుమారు రూ.250 కోట్లను చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. సంగీత, ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాకు ఈ మొత్తం అందించేలా ఒప్పందం కుదిరిందట. అయితే ఇది ఎలా పంపిణీ చేస్తారనేదానిపై మాత్రం వివరాలు బయటకు రాలేదు.
విజయ్ కుటుంబం గౌరవం, గోప్యతను కాపాడేందుకు వివేకంతో చాలా సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయని.. ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. విజయ్ తన వ్యక్తిగత జీవితాన్ని వెలుగులోకి రాకుండా ఉండేలా విడాకులకు సంబంధించి లేదా పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలకు సంబంధించి ఎటువంటి బహిరంగ ప్రకటన విడుదల చేయొద్దని కూడా భావిస్తున్నాడట. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ విడాకుల అంశం ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఉత్కంఠ నెలకొంది.
Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. చైనా సాయం కోరిన ఎన్ఐఏ కోర్టు
Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు