లక్నో: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తన ప్రియుడిని పిలిచింది. పొరుగున ఉండే బంధువైన మహిళ అతడ్ని చూసింది. ఆ మహిళ ఇంటి తలుపు తట్టింది. ఆందోళన చెందిన ఆమె ప్రియుడిని ఒక పెట్టెలో దాచి తాళం వేసింది. చివరకు పోలీసుల సమక్షంలో ఆ పెట్టెను తెరిచారు. దీంతో అతడు బయటకు వచ్చాడు. (Woman Locks Lover In Box) ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం మహిళ కుటుంబ సభ్యులు పనికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె మధ్యాహ్నం వేళ తన ప్రియుడిని పిలిచింది.
కాగా, ఏడు ఇళ్ల దూరంలో నివసించే ప్రియుడు ఆ మహిళ ఇంటికి చేరుకున్నాడు. అయితే పొరుగున ఉండే ఆమె బంధువు అతడ్ని చూసింది. ఆ ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. కంగారుపడిన ఆ మహిళ ఇంట్లో ఉన్న పెద్ద ఇనుప పెట్టెలో ప్రియుడిని దాచింది. దానికి తాళం వేసింది. ఆ తర్వాత తలుపు తెరిచింది.
మరోవైపు లోనికి వచ్చిన బంధువైన మహిళ ఇంట్లో అంతా వెతికింది. తాను చూసిన వ్యక్తి ఎక్కడో దాగి ఉంటాడని ఆమె అనుమానించింది. ఆ మహిళ తల్లి, సోదరుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. వారంతా కలిసి ఇంట్లోని అన్ని చోట్ల వెతికారు.
సుమారు 45 నిమిషాల తర్వాత ఇంట్లో ఉన్న పెద్ద పెట్టె లోపల నుంచి కొడుతున్న శబ్దం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చిన తర్వాత ఆ మహిళతో పెట్టె తాళం తీయించారు. అందులో దాగిన ప్రియుడు బతికిపోయానంటూ బయటకు వచ్చాడు. గాలి ఆడక, ఊపిరి అందక చెమటతో అతడు తడిసిపోయాడు.
అయితే ఆ వ్యక్తిని కొట్టేందుకు మహిళ కుటుంబ సభ్యులు ప్రయత్నించగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. అతడితోపాటు తన కుమార్తెను కూడా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి జైలులో పెట్టాలని ఆమె తల్లి పోలీసులకు చెప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
कानपुर में एक प्रेमी अपनी प्रेमिका से मिलने पहुचां तभी प्रेमिका के घर में लोग आ गये, प्रेमिका ने आनन-फानन में प्रेमी को बक्से में बंद कर दिया, घर वालों को बक्से से अजीब आवाजें आनी महसूस की तो उन्होंने बक्से को खोला उसमें से आदमी निकला, फिर क्या पिटाई भी हुई और पुलिस भी ले गईं। pic.twitter.com/ExjVC9Aru4
— Anuj Agnihotri Swatntra (@ASwatntra) January 24, 2026
Also Read:
Indian man shoots wife, relatives | అమెరికాలో భార్య, ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ వ్యక్తి
Father Beat Daughter To Death | 50 వరకు అంకెలు చెప్పలేదని.. కుమార్తెను కొట్టి చంపిన తండ్రి
Man Tries To Burn Daughter-In-Law | ఆడ పిల్లకు జన్మనిచ్చిందని.. కోడలికి నిప్పంటించేందుకు మామ యత్నం
Blast At railway line in Punjab | గూడ్స్ రైలు వెళ్తుండగా.. రైలు పట్టాలపై పేలుడు, ట్రాక్ ధ్వంసం