Jr NTR | కర్ణాటక రాజధాని బెంగళూరులో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మరోసారి సరిహద్దులు దాటింది. ఒక ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి అతిథిగా విచ్చేసిన తారక్‌ను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎన్టీఆర్ వస్తున్నారన్న సమాచారంతో ఆస్పత్రికి వెళ్లే దారిపొడవునా వేలాది మంది అభిమానులు గంటల తరబడి వేచి చూడటంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. తారక్ కాన్వాయ్ కనిపించగానే అభిమానుల ఉత్సాహం కట్టలు తెంచుకుంది, ఆయనను ఉద్దేశించి ‘సీఎం.. సీఎం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది.
కేవలం తెలుగు వారే కాకుండా, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా స్థానిక కన్నడ ప్రజలు కూడా ఎన్టీఆర్‌ను చూడటానికి ఎగబడ్డారు. కన్నడ గడ్డపై తారక్ మేనియా చూస్తుంటే ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక ఎమోషన్ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పర్యటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
Aaa Hand Gesture @tarak9999🥵🥵🔥🔥🔥🔥🔥#NTRInBanglore pic.twitter.com/lKzLugOHKf
— Srinivas (@srinivasrtfan) March 8, 2026