పాట్నా: సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటు చాలా సేపు తెరిచి ఉంచారు. దీంతో పలు రైళ్లు గంటకుపైగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. (trains halt for Nitish’s convoy) బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సీఎం నితీశ్ కుమార్ శనివారం కర్పూరి గ్రామానికి చేరుకున్నారు. భారత రత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ 102వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత ఆ గ్రామం నుంచి తిరిగి వెళ్లారు.
కాగా, సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్ వెళ్లేందుకు కర్పూరి గ్రామ్ స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటును చాలాసేపు తెరిచి ఉంచారు. సీఎం కాన్వాయ్ వెళ్లేంత వరకు రైలు గేటు మూయవద్దని గేట్ మ్యాన్, రైల్వే సిబ్బందిని ఆదేశించారు. పోలీసులు కూడా ఆ రైలు గేటు వద్ద మోహరించారు.
మరోవైపు సుమారు 40 నిమిషాల పాటు రైలు గేటు మూయలేదు. దీంతో సమస్తిపూర్ – ముజఫర్పూర్ రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వైశాలి ఎక్స్ప్రెస్ సుమారు గంటపాటు సమస్తిపూర్ స్టేషన్లో నిలిచిపోయింది. షహీద్ ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యమైంది.
టాటా-ఛప్రా ఎక్స్ప్రెస్ ఒక గంట నిలిచిపోయింది. బరౌని-గోండియా ఎక్స్ప్రెస్ కూడా ఆలస్యమైంది. ప్లాట్ఫారాలు అందుబాటులో లేకపోవడం వల్ల మరికొన్ని రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. దీంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read:
Blast At railway line in Punjab | గూడ్స్ రైలు వెళ్తుండగా.. రైలు పట్టాలపై పేలుడు, ట్రాక్ ధ్వంసం
Father Beat Daughter To Death | 50 వరకు అంకెలు చెప్పలేదని.. కుమార్తెను కొట్టి చంపిన తండ్రి
Watch: ప్రియుడిని పెట్టెలో దాచిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?